అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అన్నారు. తాజాగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఓ వ్యక్తికి సంబంధించిన కేసులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంభల్ జిల్లాకు చెందిన జావేద్ అనే వ్యక్తి బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతనిపై గోవధ ఆరోపణలు వచ్చాయి. అయితే అతని పిటిషన్‌ను విచారించిన జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అతనికి బెయిల్ నిరాకరించారు. జావేద్ గతంలో పలు మార్లు గోవులను వధించాడని, అతనికి బెయిల్ ఇస్తే బయటకు వచ్చాక అతను మళ్లీ అదే పనిచేస్తాడని, కనుక అతనికి బెయిల్ ఇవ్వకూడదని ప్రతివాదులు కోరారు. ఇందుకు న్యాయమూర్తి ఏకీభవించారు. అంతేకాదు, ఆయన ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అన్నారు.
ప్రపంచంలో ఆక్సిజన్‌ను పీల్చి ఆక్సిజన్‌ను వదిలే ఏకైక జంతువు ఆవు అని జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అన్నారు. దీన్ని సైంటిస్టులు కూడా నిర్దారిస్తారని తెలిపారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడతో తయారు చేసే పంచగవ్యంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, దాంతో అనేక వ్యాధులు నయం అవుతాయని అన్నారు. అందువల్ల ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అన్నారు. కాగా ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…