ప్రస్తుత తరుణంలో సైబర్ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ కొందరు మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో వారి నుంచి డబ్బులను దోచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తికి కూడా ఇలాగే జరిగింది. రూ.750 రీఫండ్ కోసం ప్రయత్నిస్తే రూ.72వేలు పోయాయి. వివరాల్లోకి వెళితే..
అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్ లైన్‌లో రూ.750కి ఓ షర్ట్‌ను ఆర్డర్ చేశాడు. అయితే ఎన్ని రోజులు గడిచినా షర్ట్ డెలివరీ కాలేదు. దీంతో ఆ షర్ట్ ఆర్డర్ పెట్టిన వెబ్‌సైట్‌లో ఉన్న కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేశాడు. తనకు షర్ట్ డెలివరీ కాలేదు కనుక రూ.750 రీఫండ్ చేయాలని కోరాడు.
అయితే నిజానికి అది ఒక ఫేక్ వెబ్‌సైట్. అందులో ఇచ్చిన నంబర్ కూడా ఫేక్. దీంతో వారు అతన్ని మోసం చేశారు. రూ.750 వెనక్కి ఇవ్వడానికి బదులుగా అతని బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలను సేకరించి అతని ఖాతాలో ఉన్న రూ.72,727 కాజేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…