ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గంగానదీ పరివాహకంలో నిర్వహిస్తున్న కుంభమేళాతో కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.ఇప్పటికే కుంభమేళ కారణంగా వందలాది మంది కరోనా బారిన పడటంతో వెంటనే కుంభమేళా ఆపు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 17న కుంభమేళ ముగిస్తున్నట్టు నిర్వాహకుడు నిరంజని అఖాడా ప్రకటించారు. ఈ కుంభమేళాలో పాల్గొనే 13 మంది అఖాడాలలో నిరంజని రెండవవారు.ఇప్పటికే పెద్ద అఖాడా అయిన మహమండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ కోవిడ్ -19 కారణంగా మరణించాడు. కోవిడ్ నిర్ధారణ కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 13న మృతిచెందారు.
అధిక సంఖ్యలో భక్తులు కుంభమేళాకు తరలిరావడంతో వందల సంఖ్యలో భక్తులు కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కుంభమేళాలో పాల్గొన్న సాధువులు ఎక్కువగా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. సాధారణంగా నాలుగు నెలల పాటు జరిగే ఈ కుంభమేళ ఉత్సవాలు కరోనా కారణం వల్ల నెలరోజులకే ముగుస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు