గతంలో కరోనా వ్యాధి విజృంభించడంతో ప్రజలు ఎంతో భయాందోళనలకు గురయ్యారు. అయితే మొదటి వేవ్ లో కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండి కోలుకునే వారి సంఖ్య అధికంగా ఉండేది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు కరోనా బారినపడే వారి సంఖ్య అధికమవడంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.ఈ విధంగా కేసుల పెరుగుతున్నప్పటికీ ప్రజలు ఏమాత్రం జాగ్రత్త పడకుండా ఎంతో నిర్లక్ష్యం వహించడం వల్లే కరోనా కేసులు అధికమవుతున్నాయి.
మొదటి వేవ్ లో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, దగ్గు జలుబు వంటి లక్షణాలను కలిగి ఉన్న ఈ వైరస్ సెకండ్ వేవ్ లో కొత్త లక్షణాలతో తీవ్రరూపం దాలుస్తుంది. ప్రస్తుతం జ్వరంతో పాటు విరేచనాలు అవుతుంటే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు తెలియజేస్తున్నారు. అదేవిధంగా కళ్ళు మంటగా ఉండటం, అధిక ఎరుపుగా ఉండి కళ్ళులాగడం కూడా కరోనా లక్షణాలే. మరికొందరిలో కరోనా వైరస్ కనుగుడ్డులో నుంచి శరీరంలోకి వ్యాప్తి చెందుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం ఒళ్ళు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారిలో కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవుతుందని డాక్టర్లు తెలుపుతున్నారు. మొదటి వేవ్ లో 40 నుంచి 60 సంవత్సరాల వయసు వారికి అధికంగా కరోనా సోకగా సెకండ్ వేవ్ లో 20 నుంచి 35 సంవత్సరాలలోపు వారికి అధికంగా వైరస్ సోకుతునట్లు తెలిపారు. గతంలో కంటే ప్రస్తుతం కరోనా మహమ్మారి కొత్త లక్షణాలతో విస్తృతంగా వ్యాపిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.