ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాపించిన ఈ కరోనా పరిస్థితులలో ఏది నిజమో, ఏది అపోహ తెలియని సందిగ్ధంలో ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలియడం లేదు.కొందరు వీటిని తీసుకోవడం వల్ల కరోనా వ్యాపించదని ప్రచారం చేయగా మరికొందరు వీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందని లేనిపోని అపోహలు కల్పిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొందరు భయాందోళనకు గురై మరణం పొందుతున్నారు.
ఇక మందుల విషయానికి వస్తే కొంతమంది లేనిపోని యాంటీబయోటిక్స్‌పై ఆధారపడుతుండగా.. మరికొంతమంది రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ తప్ప మరేది ప్రాణాలను కాపాడే లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైద్యుల పర్యవేక్షణలో కాకుండా పాజిటివ్ అని తెలియగానే సొంత వైద్యం ప్రయత్నిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఇకపోతే తాగునీటిలో వైరస్ కలుషితమైన, ఆ నీటిని ఇతరులు తాగడం ద్వారా కరోనా వస్తుందేమోనని భయపడుతుంటారు.అయితే వైరస్ కలుషితమైన నీటిని తాగటం వల్ల కరోనా వ్యాపించదని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితేపాజిటివ్ ఉన్న వ్యక్తి ఈతకొలనుకి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి దగ్గరగా ఉండే ఇతరులకు ఈ వైరస్ వ్యాపిస్తుందని, కరోనా కలుషిత నీటి ద్వారా వైరస్ వ్యాపించదని నిపుణులు తెలియజేస్తున్నారు.