మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి కుటుంబ సభ్యులు, బంధువులు శ్మశానానికి తరలిస్తారు. మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లే క్రమంలో దింపుడు కల్లం ఉంటుంది. అక్కడ శవాన్ని కింద పెట్టి మూడు సార్లు చెవిలో పిలుస్తారు. చనిపోయిన తమ ఆత్మీయులు ఏదో ఒక అదృష్టం వల్ల బతికి వస్తారని ఆశ. అయితే చనిపోయిన వారు బతికిరారు, కానీ అలా పిలవడం ఒక ఆచారం. కానీ ఆ బాలుడు మాత్రం నిజంగానే అలా తిరిగి వచ్చాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా తన తల్లి పిలిచిన మాటలకు అతను స్పందించాడు. ఈ సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
హర్యానాలోని బహదూర్‌గఢ్ ప్రాంతం అది. హితేష్, ఝాన్వి అనే దంపతులకు 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే అతనికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. దీంతో చికిత్స అందించారు. అయితే అతను చనిపోయాడు. మే 26న ఈ సంఘటన చోటు చేసుకుంది. అతను మరణించాడని వైద్యులు నిర్దారించడంతో తల్లిదండ్రులు చేసేది లేక గుండెలవిసేలా రోదిస్తూ తమ కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. తరువాత అంత్యక్రియలు నిర్వహించేందుకు పూనుకున్నారు.
అయితే కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహిస్తారనగా ఆ బాలుడి తల్లి ఆర్తనాదాలు చేసింది. ఒక్కసారి లేవరా కన్నా.. అంటూ పిలిచింది. అయితే అదృష్టవశాత్తూ ఆ బాలుడు స్పందించాడు. అతనిలో కదలిక వచ్చింది. దీంతో వెంటనే అతని తండ్రి అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించాడు. ఈ క్రమంలో బాలుడికి హాస్పిటల్‌లో చికిత్స అందించగా అతను కోలుకుని ఆరోగ్యవంతుడు అయ్యాడు. జూన్ 15న అతను డిశ్చార్జి అయ్యాడు. చనిపోయాడనుకున్న తమ కుమారుడు బతికి వచ్చే సరికి ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…