IND Vs WI : పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం భారత్‌నే వరించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని విండీస్ ఓ దశలో ఛేదించేలాగే కనబడినా పరుగుల వేటలో కాస్త వెనుకబడింది. దీంతో చివరి ఓవర్‌లో చేయాల్సిన పరుగులు ఎక్కువయ్యాయి. వాటిని సాధించలేక విండీస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో భారత్.. విండీస్‌పై 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ ముందుగా ఫీల్డింగ్ చేయగా.. భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 308 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, శుబమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ రాణించారు. శిఖర్ ధావన్ 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి సెంచరీని మిస్ చేసుకోగా.. గిల్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. అలాగే అయ్యర్ 57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అల్జరి జోసెఫ్, గుడకేష్ మోతీలు చెరో 2 వికెట్లు తీశారు. రొమారియో షెఫర్డ్, అకియల్ హోసెయిన్‌లకు చెరొక వికెట్ దక్కింది.

అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 305 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో కైలీ మయర్స్, బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్ రాణించారు. 68 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో మయర్స్ 75 పరుగులు చేయగా, 66 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో కింగ్ 54 పరుగులు చేశాడు. అలాగే 61 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో బ్రూక్స్ 46 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చాహల్‌లకు తలా 2 వికెట్ల చొప్పున దక్కాయి. ఈ సిరీస్‌లో 2వ వన్డే ఆదివారం మళ్లీ ఇదే స్టేడియంలో జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.