Ileana : ఒకప్పుడు వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన తారల్లో ఇలియానా ఒకరు. తరువాత ఆమె బాలీవుడ్ వైపు కూడా ప్రయాణం చేసింది. కానీ ఆ తరువాత అనూహ్యంగా ఆమె కెరీర్ డౌన్ ఫాల్ అయింది. తన ప్రియుడితో బ్రేకప్ అయిన అనంతరం ఈ ముద్దుగుమ్మ బయటి ప్రపంచంలో అసలు కనిపించలేదు. ఆ తరువాత సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె ఎప్పటికప్పుడు అందులో తన అందాల ఆరబోతకు చెందిన ఫొటోలను షేర్ చేస్తోంది. ఇక తాజాగా ఇలియానా మరోమారు ట్రీట్ ఇచ్చింది. బ్లూ కలర్ బికినీ ధరించి కనులవిందు చేసింది.

ఇలియానాకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాలోవర్లు బాగానే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య తాజాగా 14 మిలియన్స్‌కు చేరుకుంది. దీంతో తన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో ఇలియానా ఒక రేంజ్‌లో అందాలను ఆరబోసింది. ఈ అమ్మడి ప్రదర్శనకు అందరూ షాకవుతున్నారు.
ఇలియానా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు ఏమీ లేవు. కానీ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీలో ఈ భామ త్వరలో ఐటమ్ సాంగ్ చేయనుందట. దీనిపై క్లారిటీ రావల్సి ఉంది. అందుకోసమే ఈ అమ్మడు బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.