Ileana : గోవా బ్యూటీ ఇలియానా కెరీర్ ఆరంభంలో ఒక వెలుగు వెలిగింది. ఎన్నో హిట్ చిత్రాల్లో ఈమె నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. తరువాత ఆమె బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా ఆమె నటించిన కొన్ని చిత్రాలు హిట్ అయ్యాయి. అయితే ఆమె తన కెరీర్‌పై దృష్టి పెట్టకుండా లవ్.. రిలేషన్‌షిప్.. అంటూ దారి తప్పింది. దీంతో ఆమె ఇప్పుడు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది.

గతంలో ఆమె కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడు లవ్ కారణంగా సినిమాలను అంగీకరించలేదు. అదే ఆమె చేసిన పెద్ద తప్పు అయింది. అయితే లవ్ అన్నా సరిగ్గా జరిగిందా.. అంటే.. అదీ లేదు. తన ప్రియుడికి బ్రేకప్ చెప్పింది. దీంతో రెంటికీ చెడ్డ రేవడి సామెతలా ఆమె జీవితం మారిపోయింది. అయితే లవ్ బ్రేకప్ అయినందున ఆమె కొంత కాలం పాటు అందరికీ దూరంగా ఉంది. దీంతో ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లో ఉందని.. ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచనలు వస్తున్నాయని.. వార్తలు ప్రచారం అయ్యాయి.
అయితే తాను బాగానే ఉన్నానని.. తనకేమీ కాలేదని.. కొంత కాలం తరువాత ఆమె బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇల్లీ బేబీ యాక్టివ్‌గా ఉంటోంది. అయితే తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఓ కీలకమైన విషయం తెలిపింది. తనకు గతంలో సూసైడ్ చేసుకోవాలనుకునే ఆలోచనలు వచ్చిన మాట వాస్తవమేనని.. కానీ తనను బాడీ షేమింగ్ చేసినందుకు ఆ ఆలోచనలు రాలేదని.. అందుకు వేరే కారణాలు ఉన్నాయని మాత్రం చెప్పింది. అయితే ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినందుకు ఉన్న కారణాలు ఏమిటనేది మాత్రం ఆమె చెప్పలేదు. కానీ లవ్ బ్రేకప్ అయినందునే ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిందని.. అందుకనే ఆత్మహత్య చేసుకోవాలని అనిపించి ఉంటుందని.. తెలుస్తోంది. కానీ దీని గురించి మాత్రం ఆమె ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే సూసైడ్ ఆలోచనలు వచ్చిన మాట మాత్రం నిజమే అని ఒప్పుకుంది. దీంతో దాని వెనుక ఉన్న కారణాలను నెటిజన్లు అన్వేషిస్తున్నారు. మరి భవిష్యత్తులో అయినా ఇలియానా తన సూసైడ్ ఆలోచనలకు కారణాలు ఏమిటనేది.. చెబుతుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!