Samantha Naga Chaithanya : సమంత, నాగచైతన్య విడాకుల విషయం అభిమానులకు బాధ కలిగించే విషయం అనే చెప్పాలి. గత కొద్ది రోజుల నుంచి వీరి గురించి విడాకుల విషయంలో వార్తలు వస్తున్నప్పటికీ అందులో నిజం లేదంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తాజాగా నాగచైతన్య వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం అభిమానులకు మింగుడుపడని విషయం అని చెప్పవచ్చు.
సమంత నాగచైతన్య మొట్టమొదటిసారిగా ఏ మాయ చేసావే సినిమా ద్వారా వెండితెరపై సందడి చేశారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మనం, మజిలీ, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాలు వచ్చాయి. ఇందులో ఆటోనగర్ సూర్య కాస్త నిరాశ పరిచినప్పటికీ మిగిలిన సినిమాలు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.
వెండితెరపై ఈ ఇద్దరు నటించిన సినిమాలు అద్భుతమైన విజయాన్ని అందుకున్నప్పటికీ నిజజీవితంలో మాత్రం వీరి జీవితం విజయం కాలేకపోయింది. ఇద్దరూ ప్రేమించుకుని 2017 లో పెళ్లి బంధం ద్వారా ఒక్కటై నాలుగేళ్లపాటు వైవాహిక జీవితంలో ఆనందంగా ఉన్నారు. తాజాగా కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోయారు. వెండితెరపై హిట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంట నిజ జీవితంలో మాత్రం ఫెయిల్ అయిందని చెప్పవచ్చు.