ప్రస్తుతం మహిళలు, అమ్మాయిలపై రోజురోజుకూ ఎన్నో దాడులు, వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ వేధింపులను భరించలేక కొంతమంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
తల్లాడకు చెందిన కుసుమరాజు వర్షిత ఆరల్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అయితే అదే ఆసుపత్రిలో పని చేస్తున్న మధుకుమార్ తనని ప్రేమించాలంటూ ఆమెపై ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలోనే వర్షిత అతన్ని ఎన్నోసార్లు తిరస్కరించింది. అతన్ని తిరస్కరించినప్పటికీ మధు కుమార్ తనను ప్రేమించాలని తన కోరిక తీర్చాలని ఫోన్ చేసి విసిగించే వాడు.
ఇలా ఆమెను ఎన్నో వేధింపులకు గురి చేసినా ఆమె ఎంతో ధైర్యంగా ఉండేది. కాగా వర్షితకు మధు కుమార్ ఒక రోజు ఫోన్ చేసి తను ప్రేమించకపోయినా, తన కోరికను తీర్చకున్నా, తనతో ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ రికార్డు చేశానని వాటిని బయట పెడతానంటూ బెదిరించాడు.
మధు కుమార్ ఈ విధంగా బెదిరించడంతో ఎంతో మనస్తాపానికి గురైన వర్షిత చేసేదేమీలేక రోగులకు కొన్ని పరిస్థితులలో ఇచ్చే స్టెరాయిడ్ ఇంజక్షన్లను వేసుకుని మరణించింది. విషయం తెలుసుకున్న స్నేహితురాలు వెంటనే ఈ విషయాన్ని ఆమె తల్లికి చేరవేసి సంఘటనా స్థలానికి చేరుకునేలోపే ఈ దారుణానికి పాల్పడింది. ఆమె వెళ్లి చూడగా వర్షిత విగత జీవిగా పడి ఉంది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…