Ram Charan : కొద్ది రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ప్రేక్షకులని అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. ఇక మెగా తండ్రీ కొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ భారీ స్థాయిలో ఆచార్య రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య. నిరంజన్ రెడ్డి నిర్మాతగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్.. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించారు. ఈ నెల 29వ తేదీన ఆచార్య గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మెగాస్టార్ భావిస్తున్నట్టుగా కొన్నాళ్ల నుండి వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్‌కి హిందీలో కూడా క్రేజ్ దక్కడంతో పాన్ ఇండియా మూవీగా ఈసినిమాని రిలీజ్ చేయాలని చిరు అనుకుంటున్నారట. అలా చిరు భావిస్తే రామ్ చరణ్ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అది పెద్ద ప్రమాదం అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఒక దృశ్యకావ్యం. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ ఈ సినిమాలో నటించాడు. ఆచార్యలో మాత్రం పూర్తి స్థాయి పాత్రలో కూడా కనిపించడు. అంతేకాకుండా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందిందో.. లేదో.. తెలియదు.
చరణ్ క్రేజ్‌ని ఉపయోగించి చిరంజీవి ఆచార్య చిత్రాన్ని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే అత్యాశే అవుతుందని, దాని వలన చరణ్‌కి నష్టం వాటిల్లడం ఖాయం అని మెగా అభిమాని వ్యాఖ్యానించారు. అయితే ఆచార్య నిర్మాతలలో ఒకరైన అవినాష్ రెడ్డి మాత్రం ఆచార్య కేవలం తెలుగులోనే విడుదల చేస్తామని వెల్లడించారు. మా దృష్టి పాన్ ఇండియా పై లేదు. తెలుగులోనే భారీగా విడులకు ప్లాన్ చేస్తున్నాం. తెలుగు రాష్ట్రలలో దాదాపు 2000స్క్రీన్ లలో ఆచార్య విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఓవర్సీస్‌లో కూడా భారీగా విడుదల చేస్తాం.. అని వెల్లడించారు నిర్మాత అవినాష్ రెడ్డి.