Hyper Aadi : జబర్దస్త్ కామెడీ షో ద్వారా అందరికీ పరిచయమైన కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ వేదికపై హైపర్ ఆది స్కిట్ లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే హైపర్ ఆది జబర్దస్త్ షోలో భాగంగా సోషల్ మీడియాలో ఎవరైతే ట్రెండింగ్ లో ఉంటారో వాళ్ళ గురించి సెటైర్లు వేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటాడు. ఇలా హైపర్ఆది ఎన్నోసార్లు అందరిపై సెటైర్లు వేస్తూ క్షమాపణలు కూడా చెప్పుకున్నాడు.
తాజాగా దీపావళి పండుగ సందర్భంగా ఈటీవీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది మా అధ్యక్షుడు మంచు విష్ణును టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మా ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్ లు పెట్టి మీడియా ముందు మాట్లాడిన మాటల గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్స్ జరిగాయి. ఇదిలా ఉండగా మా ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు ఎక్కువగా.. అంకుల్, లెట్ దెమ్ నో అంకుల్.. అనే పదాన్ని.. అలాగే టంగుటూరి వీరేహం పకహం పంతులు.. అనడంతో మంచు విష్ణు చాలా మందికి టార్గెట్ అయ్యారు.
తాజాగా దీపావళి ఈవెంట్ లో భాగంగా హైపర్ ఆది స్కిట్ చేస్తూ.. ముందు నీకే తెలిసినట్టు మాట్లాడతారే, మీ కన్నా ముందు ప్రియమణి గారు మా సైడ్ నుంచి వచ్చి ఏమన్నారంటే.. అని ఆది అనడంతో అందుకు రోజా.. ఏమన్నారు.. అని అడగడంతో.. లెట్ దెమ్ నో అంకుల్, లెట్ దెమ్ నో.. అంటూ మంచు విష్ణు మాట్లాడిన మాటలను మరోసారి గుర్తు చేశాడు.
అసలు ఈ స్కిట్ లో గెటప్ శీను అంకుల్ లేడు కాబట్టి సరిపోయింది, మీకు ఈ స్కిట్ గురించి తెలుసా ? అంటూ టంగుటూరి వీరేహం పకహం పంతులును గుర్తు చేస్తూ స్కిట్ చేశాడు. ఇలా హైపర్ ఆది మంచు విష్ణును టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆది వ్యవహారశైలి చూస్తుంటే ఈ విషయం సీరియస్ గా అయ్యేటట్లు కనబడుతోందని.. పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.