Romantic Movie : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ, అందాల భామ కేతిక శర్మ ప్రధాన పాత్రలలో లవ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’. మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఊహించని కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటోంది. తొలి రోజు మంచి వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే మూవీ థియేటర్స్‌లో ప్రదర్శితం అవుతున్న సమయంలోనే ఈ మూవీ పైరసీ బారిన పడింది.
తమిళ్ రాకర్స్ రొమాంటిక్ మూవీని తమ సైట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించారు. మూవీరూల్స్, టెలిగ్రామ్‌లో కూడా రొమాంటిక్ మూవీ అందుబాటులో ఉంది. ఒకవైపు కరోనా వలన పూర్తిగా థియేటర్స్ తెరవకపోవడంతో బిజినెస్ జరగక నిర్మాతలు నెత్తి పట్టుకుంటున్న ఈ సమయంలో చిత్రం ఆన్‌లైన్‌లో లీక్ కావడం వారిని తెగ ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల లవ్ స్టోరీ, టక్ జగదీష్, పాగల్, ఎస్ఆర్ కళ్యాణ మండపం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, దర్బార్ వంటి అనేక సౌత్ ఇండియన్ సినిమాలు పైరసీ బారిన పడ్డాయి.
సౌత్ ఇండియన్ సినిమాలే కాదు, హిందీ సినిమాలు కూడా పైరసీకి గురి అవుతున్నాయి. సల్మాన్ ఖాన్, దిశా పటానీ నటించిన హిందీ చిత్రం రాధేతో సహా అనేక భారీ బడ్జెట్ చిత్రాలు పైరసీ బారిన పడి నిర్మాతలను కలవరపాటుకు గురి చేశాయి. సినిమా పరిశ్రమ మొదటి నుండి కూడా ఈ పైరసీతో ఇబ్బందులు పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.