Holidays In August 2024 : సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులకు పండగే అని చెప్పవచ్చు. సెలవుల కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక హాస్టల్స్‌లో చదివే విద్యార్థులు అయితే జైలు లాంటి ఆ లోకం నుంచి ఎప్పుడు బయట పడదామా అని ఆలోచిస్తుంటారు. అయితే విద్యార్థులకు ఆగస్టు నెలలో బాగానే సెలవులు వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఆగస్టు నెలలో సెలవులు భారీగానే ఉన్నాయి. ఇక వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీలో పాఠశాలలకు సంబంధించి సెలవుల విషయానికి వస్తే.. మొత్తం ఈ నెలలో 9 రోజుల వరకు సెలవులు ఉన్నాయి. అవేమిటంటే.. అకడమిక్ ఇయర్ ప్రకారం మొత్తం 232 పనిదినాలు కాగా 83 రోజులు సెలవులు ఉన్నాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 31 రోజులకు గాను 24 పనిదినాలు ఉండగా 7 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి వల్ల మరో రెండు రోజులు సెలవులు అదనంగా వస్తాయి. దీంతో ఆగస్టు నెలలో మొత్తం 9 రోజులు సెలవులుగా ఉంటాయి.

ఆగస్టు 4న ఆదివారం, ఆగస్టు 10న 2వ శనివారం, ఆగస్టు 11న ఆదివారం, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 16న శుక్రవారం వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 18న ఆదివారం, 19వ తేదీన రాఖీ పౌర్ణమి, ఆగస్టు 25 ఆదివారం, ఆగస్టు 26 సోమవారం శ్రీకృష్ణాష్టమి వచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పాఠశాలలకు గాను మొత్తం ఆగస్టు నెలలో 9 రోజులు సెలవులు రానున్నాయి. ఇక తెలంగాణలోనూ ఇవే రోజుల్లో సెలవులు వస్తాయి.
అయితే ఆగస్టు 10, 11 తేదీల్లో శని, ఆదివారాలు వరుసగా రెండు రోజులు సెలవులు వస్తాయి. అలాగే 15న గురువారం, 16న శుక్రవారం మళ్లీ రెండు రోజులు, అలాగే 18న ఆదివారం, 19న రాఖీ పౌర్ణమి మళ్లీ రెండు రోజులు సెలవులు వస్తాయి. అలాగే ఆగస్టు 25 ఆదివారం, 26న కృష్ణాష్టమి సందర్భంగా మళ్లీ 2 రోజులు వరుసగా సెలవులు వస్తాయి. అదేవిధంగా తమిళనాడులోనూ పాఠశాలల్లో 9 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి.