Asin : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరోయిన్లలో ఆసిన్ ఒకరు. ఈమె దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. అందులో రవితేజ హీరోగా నటించాడు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో దర్శకుడు పూరీతోపాటు రవితేజ, ఆసిన్‌లకు మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలోనే ఆసిన్ తరువాత వరుస చిత్రాల్లో నటించింది. ఒక దశలో టాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది.
ఆ మూవీ విజయం అనంతరం పూరీ ఈమెకు మరో అవకాశం ఇచ్చారు. నాగార్జునతో కలిసి ఈమె శివమణి అనే మూవీలో నటించింది. దీంతో ఈ మూవీ కూడా హిట్ అయింది. ఇక ఆ తరువాత ఆసిన్ వెనుకకు తిరిగి చూడలేదు. వరుసగా అగ్ర హీరోలు అందరితోనూ సినిమాలు చేస్తూ వెళ్లింది. బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ, వెంకటేష్‌తో ఘర్షణ, పవన్ కల్యాణ్‌తో అన్నవరం.. వంటి సినిమాలు చేసింది. అలాగే హీరో సూర్య పక్కన గజిని అనే మూవీలో నటించింది. ఈ మూవీ కూడా హిట్ అయింది. ఇలా ఆసిన్ రేంజ్ అప్పట్లో పెరిగిపోయింది.
అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆసిన్ వివాహం చేసుకుంది. రాహుల్ శర్మ అనే వ్యాపారవేత్తను ఈమె 2016లో వివాహమాడింది. ఈ క్రమంలో ఈమెకు సంతానం కూడా కలిగింది. ఒక కుమార్తె ఉంది. అయితే పెళ్లి అయిన తరువాత కూడా చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. కానీ ఆసిన్ మాత్రం ఎలాంటి సోషల్ ఖాతాలను మెయింటెయిన్ చేయడం లేదు. అయితే తాజాగా ఈమె ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో మెరిసింది. దీంతో ఈమెకు చెందిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఆసిన్ గుర్తు పట్టలేని విధంగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…