Electric Two Wheelers : ప్రస్తుత తరుణంలో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందే. దీని కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కార్లు, టూ వీలర్లు ప్రస్తుతం చాలా కంపెనీలకు చెందినవి మనకు ఎలక్ట్రిక్ మోడల్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అందుకనే వీటిని చాలా మంది కొంటున్నారు. వీటి వాడకం వల్ల మైలేజీ అధికంగా రావడంతోపాటు పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని మోసే బాధ తప్పుతుంది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతం పలు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వరుసగా అగ్ని ప్రమాదాల బారిన పడుతున్నాయి. దీంతో ఈ వాహనాలను కొనాలంటేనే వినియోగదారులు భయపడిపోతున్నారు. అయితే ఇలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అగ్ని ప్రమాదాల బారిన ఎందుకు పడుతున్నాయి ? వీటికి మంటలు ఎందుకు అంటుకుంటున్నాయి ? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ స్కూటర్స్, కార్లు, ఫోన్లలో ప్రస్తుతం ఎల్ఐ-అయాన్ లేదా లిథియమ్-అయాన్ బ్యాటరీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటి వాడకం వల్ల బ్యాటరీ వేగంగా చార్జింగ్ అవుతుంది. అలాగే ఎక్కువ సమయం పాటు బ్యాకప్ వస్తుంది. అందుకనే వీటిని ఎక్కువగా ఆయా వస్తువుల్లో ఉపయోగిస్తున్నారు. అయితే వీటి వాడకం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఉష్ణోగ్రత మరీ అధికంగా ఉన్న ప్రదేశంలో ఈ బ్యాటరీలు సులభంగా పేలేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే మానుఫాక్చరింగ్ లోపాలు ఉన్నా.. డివైస్‌లో వైరింగ్ సమస్య ఉన్నా.. లేదా.. బ్యాటరీలో సమస్య ఉన్నా.. ఎక్కువ సేపు అవసరం అయిన దానికంటే అధికంగా చార్జింగ్ పెట్టినా.. చార్జింగ్ పెట్టే ప్లగ్ లేదా అక్కడి విద్యుత్ వ్యవస్థలో సమస్య ఉన్నా.. ఇలా అనేక కారణాల వల్ల లిథియమ్-అయాన్ బ్యాటరీలు సులభంగా పేలిపోతాయి. లేదా ఆ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే ప్రస్తుతం మంటలు అంటుకుంటున్న ఎలక్ట్రిక్ టూవీలర్ల విషయానికి వస్తే.. ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్రదేశంలో వాహనాన్ని నడిపించడం లేదా చార్జింగ్ పెట్టడం.. లేదా ఇష్టానుసారంగా చార్జింగ్ పెట్టడం వల్లే.. ఆ వాహనాలు షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక నాసిరకం బ్యాటరీలను వాడినా ఇలాగే జరుగుతుంది. కనుక కంపెనీ అందించే లిథియమ్-అయాన్ బ్యాటరీ నాసిరకంది అయి ఉండవచ్చని అందుకనే వాహనాలు పేలుతున్నాయని కూడా అంటున్నారు.
అయితే ఇలా ప్రమాదాల బారిన పడుతున్నాయని చెప్పి ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని మానుకోవాల్సిన పనిలేదని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఎలాంటి హాని సంభవించదని.. మనం చేసే చిన్న పొరపాట్ల వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయని కూడా నిపుణులు అంటున్నారు. ఇక వాహనదారులు అన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి భయం లేకుండా ఎలక్ట్రిక్ వాహనాలను నడుపుకోవచ్చు. లేదంటే ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…