Hema : తెలుగు సినిమాల్లో అనేక పాత్రల్లో నటించిన హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సినిమాల్లో అనేక రకాల భిన్నమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎన్నికల సందర్భంగా క్యూలైన్ లో ఉన్న నటుడు శివబాలాజీ చేయి కొరికి రచ్చ చేసింది. ఇక ఇటీవలి కాలంలో ఆమె పలు వరుస సిసిమాలతో బిజీగా ఉంది. మరోవైపు అనేక చానల్స్‌కు ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది.
ఇక ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. తన సినీ కెరీర్ తొలి నాళ్లలో తాను పడిన ఇబ్బందులను చెప్పుకొచ్చింది. ఇప్పుడంటే షూటింగ్‌లకు వెళితే కారవాన్ లు ఉంటున్నాయని.. కానీ ఒకప్పుడు షూటింగ్‌లకు బయటకు వెళితే బట్టలు మార్చుకునేందుకు అసలు వసతి ఉండేది కాదని, టాయిలెట్స్ కూడా ఉండేవి కావని.. ఆమె తెలియజేసింది. అలాగే ఒక సినిమా షూటింగ్ సమయంలో తాను దర్శకుడి వద్ద కూర్చుని భోజనం చేస్తుంటే.. ప్రొడక్షన్ బాయ్ వచ్చి తన పట్ల అవమానకరంగా మాట్లాడాడని హేమ గుర్తు చేసుకుంది.
అయితే అలా మాటలు పడకూడదని చెప్పే ఉన్నత స్థాయికి చేరుకోవాలని చాలా కష్ట పడ్డానని హేమ తెలిపింది. ఈ క్రమంలోనే తన వద్ద వందల కోట్ల రూపాయలు ఉన్నాయా.. అని వస్తున్న వార్తలపై ప్రశ్న వేయగా.. అందుకు హేమ బదులిచ్చింది. తన దగ్గర వందల కోట్లు అయితే లేవు, కానీ ఉన్నంతలో ఆస్తి బాగానే ఉందని చెప్పింది. ఇక తన కుమార్తెకు పెళ్లి చేసి ఆమెను సెటిల్ చేసేందుకు అవసరం అయినంత సంపాదించానని.. ఇక ముందు కూడా సంపాదిస్తానని చెప్పింది. అలాగే తాను కెరీర్ తొలినాళ్లలో వేలల్లోనే మాట్లాడానని.. ఇప్పుడు లక్షల్లో మాట్లాడుతున్నానని చెప్పింది. తనకు డబ్బులను ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా పొదుపు చేయాలి.. వంటివన్నీ తెలుసని.. కనుక డబ్బు విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తానని.. హేమ తెలియజేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…