Chiranjeevi : మహానటి సినిమాతో కీర్తి సురేష్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఆమెకు ఆ మూవీకి అవార్డు కూడా లభించింది. అయితే తరువాత ఆమె చేసిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అన్నీ వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి. ఇటీవలే ఆమె నటించిన గుడ్ లక్ సఖి అనే మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆమెను ఐరన్ లెగ్ అని చెప్పి కొందరు అంటున్నారు.
అయితే కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఒకటి మహేష్ బాబు సర్కారు వారి పాట కాగా.. రెండోది చిరంజీవి భోళా శంకర్. మహేష్ పక్కన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. చిరంజీవి సినిమాలో ఆయన చెల్లెలిగా ఆమె నటిస్తోంది. అయితే ఈమె నటిస్తున్న సినిమాలన్నీ వరుస ఫ్లాప్ లు అవుతుండడంతో అటు మహేష్, ఇటు చిరు ఫ్యాన్స్.. ఆందోళన చెందుతున్నారు. ఆ మూవీలు కూడా ఫ్లాప్ అవుతాయా.. అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఒక లాజిక్‌ను చిరంజీవి ఫ్యాన్స్ చెబుతున్నారు. అదేమిటంటే.. రజనీకాంత్ అన్నాత్తె సినిమాలో ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. అయితే ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక భోళా శంకర్‌లోనూ ఆమె చిరంజీవి చెల్లెలిగానే నటిస్తోంది. దీంతో ఈ సారూప్యతను చెబుతూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు భోళాశంకర్ దర్శకుడు మెహర్ రమేష్ కూడా చాలా కాలం తరువాత సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఆయనకు గతంలోనూ అన్నీ ఫ్లాప్ మూవీలు ఉన్నాయి. దీంతో ఫ్లాప్ హీరోయిన్, ఫ్లాప్ దర్శకుడు.. ఇలా ఇద్దరూ భోళా శంకర్ సినిమాకు పనిచేస్తున్నారు.. కనుక ఈ మూవీ ఫ్లాప్ అవుతుందేమోనని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ ఈ సినిమాతో హిట్ కొడతారా.. అన్న అనుమానాలను కూడా రేకెత్తిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్‌లో ఆందోళన పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…