Hema Chandra : ఈ మధ్యకాలంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలపై రూమర్స్ ఎక్కువవుతున్నాయి. మొన్నీ మధ్య నుంచే సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్‌లు వివాహం చేసుకోబోతున్నారని వార్తలు హల్ చల్ చేసిన విషయం విదితమే. అయితే నరేష్ స్వయంగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చినా ఈ వార్తలు ఇంకా ఆగడం లేదు. అలాగే సింగింగ్‌కపుల్ హేమచంద్ర, శ్రావణ భార్గవిలపై కూడా రూమర్స్ వచ్చాయి. వీరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు ట్రెండ్ అయ్యాయి. అయితే ఎట్టకేలకు తమపై వస్తున్న వార్తలపై వీరు స్పందించారు. విడివిడిగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా అసలు విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ అసలు వారు ఏమన్నారంటే..
హేమ చంద్ర తమ విడాకుల వార్తలపై ఘాటుగా స్పందించారు. తనదైన శైలిలో పోస్ట్ పెట్టారు. కొందరు మూర్ఖులు తమ సమయాన్ని వృథా చేసుకుని తప్పుడు సమాచారాన్ని వేగంగా ప్రచారం చేస్తున్నారని.. తాము ఎంత ప్రేమగా ఉంటున్నామో కొందరికి తెలియదని అన్నారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను తలకిందులుగా పెట్టారు. దీంతో ఆయన తనపై వార్తలను ప్రచారం చేసిన వారిపై సెటైర్ వేసినట్లు అనిపిస్తోంది.

ఇక శ్రావణ భార్గవి కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించారు. గత కొద్ది రోజులుగా తన యూట్యూబ్ చానల్‌లో వీడియోలకు వ్యూస్ పెరిగాయని, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కూడా పెరిగిందని, గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా పనిచేస్తున్నానని, అప్పటికి ఇప్పటికి తన ఆదాయం పెరిగిందని.. ఇది మంచిదేనని.. అయితే తప్పా ఒప్పా అనేది పక్కన పెడితే.. తనకు మీడియా ఆశీస్సులు ఉన్నాయని.. ఆమె వెల్లడించింది. అయితే ఆమె ఇన్‌డైరెక్ట్‌గా మీడియాపై కౌంటర్ వేసినట్లు అర్థమవుతోంది. ఇలా వీరిద్దరూ తమ విడాకుల వార్తలపై స్పష్టంగా క్లారిటీ ఇచ్చేశారు. అంటే వీరు విడాకులు తీసుకోనట్లేనని అర్థం అవుతుంది. అయితే ఎంతో మంది ముందు ఇలాగే ఖండించారు. తరువాత విడాకులు తీసుకున్నారు. కనుక వీరు కూడా అలాగే చేస్తారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.