Heat Stroke : వేసవి కాలం.. ఈ సీజన్‌లో సహజంగానే మన శరీరం వేడిగా ఉంటుంది. ఇక వేడి పదార్థాలు, నూనెతో తయారు చేసిన ఆహారాలను తింటే.. శరీరంలో వేడి ఇంకా ఎక్కువవుతుంది. అలాగే బయట ఎక్కువగా తిరిగినా కూడా శరీరం వేడిగా మారుతుంది. దీంతో ఎండ దెబ్బ బారిన కూడా పడతారు. శరీరం వేడిగా మారితే మూత్రంలో మంట.. విరేచనాలు.. వంటి సమస్యలు వస్తాయి. అయితే ముందుగానే జాగ్రత్త పడితే ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అందుకు గాను శరీరాన్ని చల్లబరుచుకునే ప్రయత్నం చేయాలి. దీంతో వేడి సహజంగానే తగ్గుతుంది. ఇక శరీరాన్ని చల్లబరిచేందుకు పలు ఆహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే..
రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ దానిమ్మ పండ్ల రసం తాగాలి. ఇది శరీరాన్ని చల్లగా మారుస్తుంది. రోజంతా చల్లగా ఉంచుతుంది. అలాగే రోజూ ఉదయం, సాయంత్రం ఒక్క గ్లాస్ చొప్పున కొబ్బరినీళ్లను తాగాలి. దీని వల్ల కూడా శరీరం చల్లగా ఉంటుంది. ఇక ఉదయం, సాయంత్రం ఒక టీస్పూన్ మెంతులను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దీని వల్ల కూడా శరీరంలోని వేడి తగ్గుతుంది.
రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ తేనె కలిపి తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ గసగసాల పొడిని కలిపి తాగినా కూడా శరీరం చల్లగా ఉంటుంది. దీంతోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం అనంతరం ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను తినవచ్చు. లేదా ఒక గ్లాస్ తర్బూజా జ్యూస్ తాగవచ్చు. ఇవన్నీ శరీరంలోని వేడి తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. దీంతో వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…