Healthy Foods : మన శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం. ఎప్పుడైతే పోషకాలు మనకు సక్రమంగా అందుతాయో నిత్యం ఆరోగ్యంగా జీవనం గడుపుతారు. ఏదైనా అనారోగ్య సమస్యకు గురైతే చాలు ప్రతి ఒక్కరు బాదం, పిస్తా తినండి బలంగా ఉంటారు అంటూ సలహాలు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. ఒక కేజీ బాదం ఖరీదు దాదాపుగా రూ.800 ఉంటుంది. కేవలం గొప్పవారికి మాత్రమే ఆరోగ్యంలో బలహీనతలు ఉండవు, పేదవారు కూడా అనేక అనారోగ్య సమస్యలకు లోనవుతుంటారు. ముఖ్యంగా వీరిలో పోషకాల లోపం అనేది అధికంగా ఉంటుంది.
మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడానికి ఎంత ఖర్చు చేయటానికైనా సిద్ధంగా ఉంటున్నారు. ఖరీదైన వాటితోనే మనకి పోషకాలు అందుతాయి అనేది చాలా తప్పు. తక్కువ ధరలో దొరికే ఎన్నో ఆహార పదార్థాలలో మంచి పోషక విలువలు కూడా కలిగి ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం పొందే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. శనగలలో ప్రోటీన్ చాలా సమృద్దిగా ఉంటుంది. శాకాహారులకు శనగలు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అంతేకాదు శనగలను పేదవాడి బాదం అని కూడా చెబుతారు. శనగలలో ప్రోటీన్ లతో పాటు ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శనగలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహకరిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.
పెసలలో ప్రొటీన్లు మరియు పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాలకు బలం అందించడంలో సహాయపడుతాయి. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించి బరువు తగ్గే వారికి ఎంతో ఉపయోగపడుతాయి. అదేవిధంగా పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. మనకు అతి తక్కువ ధరలో దొరికే ఆకుకూరల్లో పాలకూర ఒకటి. వారంలో రెండు సార్లు పాలకూరను ఆహారంలో బాగంగా చేసుకుంటే శరీరానికి అవసరమయ్యే విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యంలో కీలక పాత్రను పోషిస్తుంది. అలాగే గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా దరిచేరనివ్వదు.
అతి తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే వాటిలో మిల్లెట్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. మిల్లెట్స్ లో ముఖ్యంగా చెప్పుకోవలసినవి సజ్జలు. 100 గ్రాముల సజ్జలలో 3 మిల్లీ గ్రాముల ఐరన్ లభిస్తుంది. సజ్జలలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, పీచు పదార్థం పుష్కలంగా ఉండటం వల్ల ఆహారం నిదానంగా జీర్ణమై చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది. అదేవిధంగా ఎముకలు దృఢంగా తయారవుతాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సజ్జలు కీలక పాత్ర వహిస్తాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారికి సజ్జలు చక్కని ఆహారం అని చెప్పవచ్చు. వీటిని నిత్యం ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన షుగర్ లెవల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. రక్తహీనతతో బాధపడేవారు సజ్జలతో తయారుచేసిన పదార్థాలు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…