Vernika : ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులను మర్చిపోవడం అంత ఈజీ కాదు. అనుభవం లేకపోయినప్పటికీ చాలా సన్నివేశాల్లో వారు చూపించే హావభావాలు ప్రేక్షకులకు అలా గుర్తుండిపోతాయి. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులు వరుసగా సినిమాలతో బిజీగా కనిపించేవారు. ఇటీవల కాలంలో మాత్రం అలా ఎక్కువ మంది పెద్దగా కనిపించడం లేదు. ఒకటి రెండు మూడు సినిమాలతోనే మాయమవుతున్నారు. ఇక సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన చిన్నారి గుర్తుండే ఉంటుంది.
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో వచ్చిన రెండవ సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో అన్నగా చేసిన వెన్నెల కిషోర్ కూతురు అల్లు అర్జున్ పక్కనే కనిపించిన చిన్నారి వర్ణిక బాగా హైలెట్ అయింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక చిన్నారి పాప క్యారెక్టర్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ చాలా మందితో ఆడిషన్స్ నిర్వహించారు. ఆ సమయంలో అనుకోకుండా తన అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా త్రివిక్రమ్ ఒక చిన్నారి ఫోటో చూశారు. ఆ పాప చాలా క్యూట్ గా అనిపించడంతో త్రివిక్రమ్ ఆ పాపను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

దీంతో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన వర్ణిక ఆడియెన్స్ కు కూడా బాగా నచ్చేసింది. అల్లు అర్జున్ తో ఆ పాప సన్నివేశాలు చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇక సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో రకుల్ ప్రీత్ చిన్నప్పటి పాత్రలో నటించింది. మళ్ళీ ఆ తర్వాత వర్ణిక పెద్దగా సినిమాలు చేసింది లేదు.
ఇక రీసెంట్ గా ఆమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వర్ణిక ఒక ఫోటోలో స్టైలిష్ గా కనిపిస్తూ ఉండగా మరొక ఫోటోలు లంగా ఓణీతో ట్రెడిషినల్ గా కనిపించింది. ప్రస్తుతం స్కూల్ దశలో ఉన్న చిన్నారి వర్ణిక పూర్తిగా చదువుపైనే ఫోకస్ పెట్టిందట. కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇక ముందైనా వర్ణిక ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.