Happy Birth Day Movie : దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన మత్తు వదలరా చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. అయితే అదే జోరుతో ఆయన చేసిన హ్యాపీ బర్త్ డే మూవీ మాత్రం నిరాశ పరిచింది. ఇందులో లావణ్య త్రిపాఠి లీడ్ రోల్‌లో నటించింది. ఈ మూవీకి గాను ఎస్‌ఎస్ రాజమౌళిచే ప్రమోషన్స్ నిర్వహించారు. చిత్ర ట్రైలర్‌ను ఆయనతో రిలీజ్ చేయించారు. అయితే అది చిత్రానికి ఏమాత్రం హెల్ప్ అవలేదు.
ఇక థియేటర్లలో నిరాశ పరిచిన హ్యాపీ బర్త్ డే మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో అదే యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 8వ తేదీన ఈ మూవీని నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ మూవీ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందని తెలుస్తోంది. కాగా రితేష్ రానా ఈ మూవీని సర్రియల్ కామెడీ జోనర్‌లో యాక్షన్, థ్రిల్స్ ఉండేలా తెరకెక్కించారు. ఇందులో లావణ్య త్రిపాఠితోపాటు సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.