Guntur : ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వెంటనే ప్రజలు వైద్యులను దేవుళ్లుగా భావించి వారి వద్దకు పరుగులు తీస్తారు. అయితే వైద్యులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా కొన్నిసార్లు తమ వక్రబుద్ధిని బయట పెడుతుంటారు. ఇలా గుంటూరు జీజీహెచ్ లో దారుణమైన బాగోతం బయటపడింది.
ఆ హాస్పిటల్‌కు నిత్యం ఎంతో మంది వైద్య సేవల కోసం పరుగులు పెడుతుంటారు. తాజాగా పాత గుంటూరుకు చెందిన ఓ యువతి ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే డాక్టర్ ఈసీజీ చేయించాలని సూచించడంతో వారు ల్యాబ్ కు వెళ్లారు.
అయితే అక్కడ ఈసీజీ పరీక్షలు చేసే టెక్నీషియన్ హరీష్ అనే యువకుడు ఆ యువతి తల్లిదండ్రులను బయటకు పంపించి తన ఒంటిపై ఉన్న బట్టలను తొలగించాలని చెప్పాడు. అందుకు ఆ యువతి నిరాకరించడంతో.. బట్టలు తీయకపోతే రిపోర్టులు సరిగా రావని చెప్పడంతో.. ఆ యువతి చేసేదేమీ లేక బట్టలు విప్పి కళ్ళు మూసుకుని పడుకుంది.ఈ క్రమంలోనే హరీష్ సెల్ ఫోన్ లో ఆమె చిత్రాలను బంధించడం చూసి నిర్ఘాంత పోయిన ఆ యువతి వెంటనే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది.
ఈ క్రమంలోనే ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎంక్వైరీ చేయగా అసలు విషయాలు బయటపడ్డాయి. అసలు ల్యాబ్ లో పని చేస్తున్న హరీష్ అనే యువకుడు సిబ్బంది కాదని వెల్లడైంది. అక్కడ పరీక్షలు చేసే వైద్యుడు అనారోగ్యంతో ఉండటం వల్ల ఆయన తన విద్యార్థిని అక్కడ పెట్టాడు. అయితే ఆ విద్యార్థి కూడా విధులకు హాజరు కాలేదు. దీంతో సంబంధం లేని హరీష్ ల్యాబ్ లో పనిచేస్తున్నాడని తేలింది. ఈ క్రమంలోనే అతను అమాయక యువతుల జీవితాలతో ఆడుకుంటున్నాడని తేలింది.
దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. హరీష్ కేవలం ఆ యువతి పట్ల మాత్రమే అలా ప్రవర్తించడా.. లేక ఇంకా ఎంత మందితో ఈ విధంగా ప్రవర్తించాడు.. అంటూ ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ఏది ఏమైనా ఇలాంటి వాళ్లను మాత్రం వదలకుండా కఠినంగా శిక్షించాల్సిందే..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…