Golden Fish : కచిడి.. నిజంగా బంగారం లాంటి చేపే.. వలలో పడిందా లక్షల రూపాయలు వచ్చినట్టే. ఆహారంగా ఆడ చేపలు అద్భుతమైన రుచిని అందిస్తే.. ఇక మగ చేపలు ఔషధాల తయారీలో ఖరీదైన వైన్‌ను శుభ్రం చేయడంతో పాటు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో కచిడి చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. గోదావరి జిల్లాల్లో కనిపించే ఈ చేప మత్స్యకారులకు సిరులు కురిపిస్తోంది. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ జాలరి పంట పండింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్రతీరంలో ఉప్పాడకు చెందిన మత్స్యకారుడు వల వేయగా.. 18 కేజీల మగ కచిడి చేప చిక్కింది.
దీనికి వేలం పాటలో 2,90,000 రూపాయల ధర పలికింది. ఇది చాలా పెద్ద మొత్తం. దాదాపు మాములు చేపలు 5, 6 నెలలు అమ్మితే వచ్చే అమౌంట్. దీంతో ఆ మత్స్యకారుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాధారణంగా మగ కచిడి చేప ఉదరభాగంలో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అందుకే ఈ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. వ్యాపారులు దీన్ని దక్కించుకునేందుకు పోటీ పడతారు. ఇలాంటి చేపలు ఏడాదికి 4 పడ్డా, జాలర్ల పంట పండినట్లే అని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ కచిడి చేపను గోల్డెన్ ఫిష్‌గా అని కూడా అంటారు. దీని విలువ ఎక్కువగా ఉండటంతో ఆ పేరు వచ్చింది. ఆపరేషన్ అనంతరం వైద్యులు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారు. చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం సమయం గడిచే కొద్దీ శరీరంలో కలిసిపోతుంది. పులస లేదా కచిడి వంటి చేపలు దొరికితే రైతులకు పండగే. ఇవే అత్యధిక ధరను కలిగి ఉంటాయి. పుస్తెలు అమ్మైనా సరే.. పులస తినాలంటారని మీకూ తెలిసే ఉంటుంది. ఆ చేప టేస్ట్ అలాంటిది మరి. ఇక కచిడి ఏమో మెడిసిన్ కోసం వాడతారు. గోదావరి తీర ప్రాంతాల్లో దొరికే చేపల్లో వీటికే ఖరీదు ఎక్కువ.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…