Akhanda : ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ కామన్ కానీ సీనియర్ హీరోలు చిరంజీవి – బాలకృష్ణ మధ్య పోటీ అంటే ఆ మజాయే వేరు. తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా గాడ్ ఫాదర్ వచ్చింది. ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఈ సినిమా వసూళ్లు కొంత డౌన్ అయ్యాయి. ఈ క్రమంలోనే చిరంజీవి లూసిఫర్ ను బాలకృష్ణ బ్లాక్ బాస్టర్ అఖండ సినిమాతో పోల్చి చూస్తున్నారు. అయితే గాడ్ ఫాదర్ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు, అఖండ ఫస్ట్ వీక్ రికార్డును టచ్ చేయలేకపోయింది.
గాడ్ ఫాదర్ ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఏపీ, తెలంగాణలో రూ. 40 కోట్లు రాబట్టింది. కర్ణాటకలో రూ. 4.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.75 కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 96 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రు. 53 కోట్ల షేర్ కొల్లగొట్టింది. అయితే గాడ్ ఫాదర్ కు ఏపీ, తెలంగాణలో ఏడో రోజు వసూళ్లు భారీగా పడిపోయాయి. కేవలం రూ. 83 లక్షల షేర్ మాత్రమే వసూలు అయింది. అదే బాలయ్య నటించిన అఖండ సినిమా ఏకంగా తొలి 11 రోజులు వరుసగా కోటి రూపాయలకు తగ్గకుండా షేర్ రాబట్టింది. గాడ్ ఫాదర్ మాత్రం ఈ రికార్డు విషయంలో కేవలం 6 రోజులకే పరిమితం అయింది.
ఇక గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా తొలి వారం రోజుల్లో రూ. 53 కోట్ల షేర్ రాబడితే, అఖండ రూ. 55 కోట్ల షేర్ రాబట్టింది. ఈ విధంగా ఇద్దరూ స్టార్ హీరోల రికార్డులను పోల్చి చూస్తూ చిరు బాలయ్యను టచ్ చేయలేకపోయాడు.. బాలయ్య బాబు తోపు.. దమ్ముంటే ఆపు అంటూ ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. నెక్స్ట్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య, బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ 2 సినిమాల్లో ఎవరు రికార్డులను ఎవరు కొల్లగొడతారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…