Godfather Press Meet : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం.. గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. మళయాళంలో హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో నయనతార, సునీల్, సత్యదేవ్ తదితర నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్, పోస్టర్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. కాగా గాడ్ ఫాదర్ రిలీజ్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ప్రెస్ మీట్‌లో పాల్గొన్న చిరంజీవి పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్పారు. గాడ్ ఫాదర్‌లో ఉన్న డైలాగ్స్ నిజ జీవితంలో ఉన్న రాజకీయ పార్టీలను ఉద్దేశించి రాసినవా.. అని అడగ్గా.. అలా ఏమీ కాదని చిరంజీవి తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు కాస్త దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో పవర్‌ఫుల్ డైలాగ్స్‌ను రాయడం జరిగిందన్నారు. ఇక తమ్ముడు పవన్ నడిపిస్తున్న జనసేన గురించి కూడా చిరుకు ప్రశ్నలు ఎదురయ్యాయి.
తమ్ముడు పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న జనసేన పార్టీలో చేరుతా.. ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.. ఇది నిజమేనా.. అని అడగ్గా.. అందుకు చిరు స్పందిస్తూ.. అలా ఏమీ లేదన్నారు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా బయటకు వచ్చానని తెలిపారు. తాను బయటికి రావడం వల్ల తమ్ముడు పవన్‌కు ఇంకా మద్దతు పెరుగుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అయితే తన సపోర్ట్ పవన్‌కు ఎప్పుడూ ఉంటుందన్నారు. పవన్ తన తమ్ముడని.. కనుక తన మద్దతు ఉంటుందని చిరు తెలిపారు. ప్రజలు మెచ్చే నాయకుడిగా పవన్ ఎదిగితే తాను జనసేనలో చేరవచ్చేమో.. అని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి చిరు.. జనసేన, పవన్ పై చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…