Godfather First Review : మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తరువాత నటించిన చిత్రం.. గాడ్ ఫాదర్. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇందులో నయనతార, సునీల్, సత్యదేవ్, సముద్రఖని, మురళీ శర్మ వంటివారు కీలకపాత్రల్లో నటించారు. అయితే రీమేక్ సినిమా కావడంతో సినిమా ఎలా ఉంటుందోనని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ చిత్రం ట్రైలర్‌తో అందరి అంచనాలను అందుకునేలా ఉందని కామెంట్లు వినిపించాయి.
ఇక గాడ్ ఫాదర్ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటించారు. ఈ క్రమంలోనే సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మళయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన లూసిఫర్‌కు రీమేక్‌గా తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మళయాళ సినిమాలో మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. ఈ మూవీ ఇప్పటికే ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది. అయితే తెలుగులో చాలా మంది వీక్షించారు. కనుక స్టోరీ ఏంటో అందరికీ తెలుసు. అందువల్ల గాడ్ ఫాదర్‌ను ఆదరిస్తారా.. అనే ప్రశ్న వస్తోంది. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సినిమాను తెరకెక్కించారు. కనుక తప్పక హిట్ అవుతుందని.. చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇక గాడ్ ఫాదర్ చిత్రానికి గాను ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ క్రిటిక్, సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సంధు గాడ్ ఫాదర్ మూవీని చూశానని చెబుతూ రివ్యూ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. గాడ్ ఫాదర్ సినిమాను చూశా. సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన రివ్యూ ఇది. బి, సి క్లాస్ ప్రేక్షకులకు ఇది యావరేజ్‌గా అనిపిస్తుంది. కొత్త సీసాలో పాత సారా అన్నట్లు ఉంటుంది. చిరంజీవి, దయ చేసి మీరు రెస్ట్ తీసుకోండి. మంచి కథను ఎంచుకుని సినిమాలను తీయండి. ప్రజల మనిషి, మాస్ హీరో వంటి క్యారెక్టర్లతో సినిమాలు చేయండి. చెత్త కథలతో ప్రయోగాలు చేయకండి.. అంటూ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…