Godfather OTT : గాడ్ ఫాదర్ చిరంజీవి 153వ సినిమా. ఇప్పటికీ టాలీవుడ్ లో ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే థియేటర్ల వద్ద సందడే వేరుగా ఉంటుంది. ఇక గాడ్ ఫాదర్ సినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 5 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
మళయాళంలో సూపర్ హిట్ అయిన గాడ్ ఫాదర్ చిత్రం తెలుగులో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లుగా తెలిసింది. దీంతోపాటు చిరంజీవి తదుపరి సినిమా రైట్స్ ను కూడా ఇదే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం అందింది. ఇక ఈ గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లలో ప్రదర్శన అయిపోయిన వెంటనే ఓటీటీలో ప్రసారం కానుంది. త్వరలో ఓటీటీ విడుదల తేదీని ప్రకటించనున్నారు.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవి బ్రహ్మ అనే ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించారు. నయనతార, సత్యదేవ్, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. చిరంజీవి స్టైల్, యాక్షన్ సీక్వెన్సులు, ఆయన మ్యానరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీ ప్రేక్షకులు కనీసం 4 వారాలైనా ఆగాల్సిందేనని సినీ విశ్లేషకులు అంటున్నారు.