Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం.. ఆచార్య. వాస్తవానికి చిరంజీవి ఈ మూవీపై ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. కానీ ఆయన నమ్మకం వమ్ము అయింది. ఆచార్య భారీ విజయం సాధిస్తుందని చిరంజీవి అనుకున్నారట. అయితే అందుకు భిన్నంగా భారీ డిజాస్టర్ అయింది. ఈ క్రమంలోనే చిరంజీవి తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే తన భవిష్యత్తు సినిమాలు ఇలా డిజాస్టర్‌లుగా మారకుండా ఉండేందుకు గాను చిరంజీవి పేరు మార్చుకున్నారని.. గత రెండు, మూడు రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దానికి బలం చేకూర్చేలా గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్‌లోనూ చిరంజీవి ఇంగ్లిష్ పేరు మారి కనిపించింది. దీంతో ఆయన నిజంగానే పేరు మార్చుకుని ఉంటారని చాలా మంది నమ్మారు.
వాస్తవానికి ఆచార్య మాత్రమే కాదు.. గతంలో చిరంజీవి కెరీర్‌లో ఇంకా ఎన్నో భారీ ఫ్లాప్స్ వచ్చాయి. అయినప్పటికీ ఆయన పేరు మార్చుకోలేదు. కానీ గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు టీజర్‌లో Chiranjeevi అని రెగ్యులర్‌గా కనిపించేలా వేయకుండా Chiranjeeevi అని మూడు ఆంగ్ల e అక్షరాలు వచ్చేలా పేరు వేశారు. దీంతో చిరంజీవి పేరు మార్చుకున్నారేమోనని అందరూ అనుకున్నారు. దీనిపై అనేక కథనాలు వచ్చాయి. అయితే దీనిపై గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్ స్పందించింది. చిరంజీవి పేరు మార్చుకోలేదని క్లారిటీ ఇచ్చేసింది.

చిరంజీవి ఎలాంటి పేరు మార్చుకోలేదని.. అది చూడకుండా జరిగిన మిస్టేక్ అని గాడ్ ఫాదర్ టీమ్ స్పష్టం చేసింది. అయితే అంత భారీ చిత్రానికి సంబంధించి ఏదైనా అప్‌డేట్ ను రిలీజ్ చేసేటప్పుడు ఇంతటి బ్లండర్ మిస్టేక్‌ను ఎలా చేస్తారు.. అని మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. మేకర్స్‌ను ఈ విషయంలో చిరు ఫ్యాన్స్ భారీగానే ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా చిరంజీవి పేరు మార్పు అన్న వార్త మాత్రం సంచలనం సృష్టించింది. అయితే ఎట్టకేలకు గాడ్ ఫాదర్ టీమ్ స్పష్టం చేయడంతో ఇక ఈ విషయంపై చర్చకు ఫుల్‌స్టాప్ పడినట్లే అయింది.