Viral Video : ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన సాంగ్స్ ఏంటంటే బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు అని చెప్పవచ్చు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కు జానీ మాస్టర్ బ్యూటిఫుల్ గా కొరియోగ్రఫీ చేశాడు. ఈ సాంగ్ లో విజయ్, పూజా హెగ్డెలు సూపర్ డ్యాన్స్ తో అదరగొట్టారు. అనిరుధ్, జోనితా గాంధీ పాడిన ఈ పాటకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. కాగా.. నెల్సన్ డైరెక్ట్ చేసిన బీస్ట్ సినిమా ఏప్రిల్ 13న వరల్డ్ వైడ్ గా విడుదల అయింది. సాంగ్ ఎంత హిట్ అయిందో అంతగా సినిమా నిరాశపరచింది. బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా తేలిపోయింది.

అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాటకు నటుడు శివకార్తికేయన్ సాహిత్యం అందించారు. చిత్ర సీమకు సంబంధించిన బిగ్ స్టార్స్ అంతా ఇప్పటికే ఈ పాటకు తమ కాలు కదిపారు. అనేక మంది ఈ సాంగ్‌కు స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. టీమిండియా యువ ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, ఆవేష్ ఖాన్ కూడా ఈ పాటలకి స్టెప్పలేశారు. తమదైన స్టైల్‌లో డ్యాన్స్ చేసి ఎంతగానో ఆకట్టుకున్నారు. వారి డ్యాన్స్‌కి సోషల్ మీడియా షేక్ అయింది.
View this post on Instagram
ఇక పీవీ సింధుతోపాటు మహేష్ కూతురు సితార, కీర్తి సురేష్., పూజా హెగ్డె, సమంత ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు కాలు కదిపారు. ఇప్పుడు కాస్త లేట్ అయినా లేటెస్ట్‌గా అదరగొట్టింది రాధ ప్రియాంక. ఈ అమ్మడి డ్యాన్స్ కి సోషల్ మీడియా షేక్ అయింది. నడుము తెగ తిప్పేస్తూ కుర్రాళ్లు గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు ఈ అమ్మడి వీడియోకి నెటిజన్స్ కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు.