Ginna Teaser : టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ జిన్నా. పూర్తి యాక్షన్, కమర్షియల్, ఎంటర్‌టైనింగ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. చాలాకాలంగా సరైన హిట్ లేని మంచు విష్ణు ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. జిన్నా సినిమాలో అందాల భామలు పాయల్ రాజ్‌పూత్, సన్నీ లియోన్ లు నటిస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవల మూవీ నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. హీరోయిన్స్ తో ఉన్న సరికొత్త రొమాంటిక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ నేపథ్యంలో జిన్నా సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచు విష్ణు క్యారెక్టర్ తెగ ఆకట్టుకుంది. హాట్ బ్యూటీలు సన్నీ లియోన్, పాయల్ రాజ్ పూత్ తమ అందచందాలతో కనువిందు చేశారు. టీజర్లో మంచు విష్ణుకు సన్నీలియోన్ లిప్‌కిస్ ఇచ్చే సీన్ హైలెట్‌గా ఉంది. ఏదేమైనా సినిమాలో ఫస్టాఫ్ అంతా కామెడీతోపాటు ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్‌కు తోడు సెకండాఫ్‌లో హార్రర్ కూడా మిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ చూసి మూవీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. టెంట్ హౌజ్‌కు ఓనర్‌గా మంచు విష్ణు ఈ చిత్రంలో కనిపించనున్నాడు.

ఏ పని చేయకుండా.. ఊరంతా అప్పులు చేస్తూ గడుపుతున్న విష్ణు లైఫ్‌లోకి సన్నీలియోని ఎంట్రీ ఇస్తుంది. ఈ టీజర్ చూస్తుంటే మంచు విష్ణు ఖాతాలో హిట్ పడ్డట్లే కనిపిస్తోంది. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జిన్నా సినిమాకు సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జిన్నా సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు. తెలుగుతోపాటు మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.