Ginna Movie Review : మంచు విష్ణు చాలా కాలం తరువాత చేసిన చిత్రం.. జిన్నా. అనేక అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ప్రధానాంశంగా వచ్చిన ఈ చిత్రంలో ఇద్దరు ముద్దు గుమ్మలు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పూత్‌లు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ మూవీ ఎలా ఉంది.. కథ ఏమిటి.. సినిమా ఆకట్టుకుంటుందా.. లేదా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
చిత్తూరు జిల్లాలో జిన్నా (విష్ణు) ఒక టెంట్ హౌస్ నడుపుతుంటాడు. అప్పటికే విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి ఉంటాడు. అదే సమయంలో రేణుక (సన్నీ లియోన్) ఇండియాకు తన సొంత ఊరికి వస్తుంది. ఆమె చాలా ధనవంతురాలు. జిన్నాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. తన చిన్ననాటి స్నేహితుడైన జిన్నా మాత్రం స్వాతి (పాయల్ రాజ్‌పూత్)ను ప్రేమిస్తుంటాడు. దీంతో అతను రేణుకను మోసం చేసి ఆమె డబ్బు మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. అయితే అతను అనుకున్నది నెరవేరుతుందా.. చివరకు ఏమవుతుంది..? అన్న వివరాలనుత తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ..
మంచు విష్ణు చాలా కాలం తరువాత జిన్నా మూవీతో అలరించాడు. ఇందులో కామెడీ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. తన నటనతోపాటు విష్ణు ఇందులో తన డ్యాన్స్‌తోనూ అలరించాడు. ఇక సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పూత్, నరేష్, సురేష్, చమ్మక్ చంద్ర తదితరులు తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు. వెన్నెల కిశోర్ కామెడీ కూడా అలరిస్తుంది. కోన వెంకట్ ఈ మూవీలో కావల్సినంత కామెడీ ఉండేలా జాగ్రత్త పడ్డారు. అందువల్ల ప్రేక్షకులకు సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టదు. అలా సాగుతూనే ఉంటుంది.
అనూప్ రూబెన్స్ సంగీతం, కొరియోగ్రఫీ, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ఇలా టెక్నికల్ అంశాల పరంగా కూడా మూవీ బాగానే వచ్చిందని చెప్పవచ్చు. అయితే కథనం నెమ్మదిగా సాగడం, క్లైమాక్స్ ముందే తెలిసిపోవడం వంటి పలు అంశాలు మైనస్ పాయింట్లుగా చెప్పవచ్చు. కానీ ఓవరాల్‌గా చూస్తే జిన్నా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. కనుక కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారు ఈ మూవీని ఒకసారి తప్పక చూడవచ్చు.