Ghani Movie : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్‌లో మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఒక్కోసారి కథల ఎంపికలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఫ్లాపులు మూటగట్టుకుంటున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ చిత్రం గని. ఈ సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేశారు. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. నదియా, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర ఇతర కీలకపాత్రల్లో కనిపించారు.
భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానులని చాలా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో గని ఫలితంపై వరుణ్ తేజ్ ఎమోషన్ అవుతూ ఓ పోస్ట్ కూడా పెట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా కొనుగోలు చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 22న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఓటీటీలో అయినా ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందా.. అనే చూడాలి.
గని సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ లో పెట్టుబడి రాలేదు. అయితే గని సినిమా ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా రూ.20 కోట్లకు పైగా అమ్మేసినట్టు సమాచారం. ఈ లెక్కన ప్రీ రిలీజ్ బిజినెస్, డిజిటల్, శాటిలైట్ అన్నీ కలిపితే గని సినిమా నిర్మాతలు లాభాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు రూ.25.3 కోట్లలో రేంజ్ బిజినెస్ జరగగా.. రూ.26.30 కోట్ల రేంజ్‌టార్గెట్‌తో బరిలోకి దిగింది. కాగా ఈ సినిమా మొదటి రోజు నుంచే ట్రాక్ తప్పింది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మూవీ ఇంత త్వరగా ఓటీటీలోకి వస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…