Genelia : జెనీలియా.. ఈ పేరు వినగానే మొదటగా గుర్తొచ్చే సినిమా బొమ్మరిల్లు. సుమంత్ నటించిన సత్యం మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది జెనీలియా. ఆ తర్వాత సై, సాంబా, హ్యాపీతోపాటు పలు చిత్రాల్లో నటించింది. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ భామ బాలీవుడ్ స్టార్ యాక్టర్ రితేశ్ దేశ్ ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సిల్వర్ స్క్రీన్‌కు దూరమైన విషయం తెలిసిందే.
తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లి అవ్వడంతో ఇంటికే పరిమితమైంది. సినిమాలలో నటించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు ఎప్పుడూ ప్రేక్షకులకు టచ్ లోనే ఉంటుంది. జెనీలియా తన భర్త రితేష్ దేశముఖ్ తో కలిసి వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. చివరగా 2012లో నా ఇష్టం సినిమాలో మెరిసింది. ఈ బ్యూటీ చాలా కాలానికి రీఎంట్రీ ఇవ్వబోతుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా జెనీలియా కెమెరా కళ్ళకు చిక్కింది. మోకాళ్ళ పై వరకు ఉన్న రెడ్ డ్రెస్ లో కళ్ళు చెదిరే అందంతో అభిమానులను కట్టి పడేసింది. జెనీలియా నవ్వుతుంటే.. బొమ్మరిల్లులోని హాసిని గుర్తొస్తుంది అంటున్నారు నెటిజన్లు. పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఇంత అందంగా ఉందేంట్రా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. జెనీలియా గ్లామర్ కి, క్యూట్ స్మైల్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ అమ్మడు తెలుగులో ఓ మంచి ఆఫర్ కొట్టేసింది. గాలి జనార్దన్ రెడ్డి తనయుడిని హీరోగా పరిచయం చేయబోతున్న సినిమాలో ప్రధాన పాత్రలో జెనీలియా నటించనుంది.
https://youtube.com/watch?v=o__cP0rTiNY