Gautam Krishna : సూపర్ స్టార్ మహేష్ బాబు ఈమధ్యే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆయన తరువాతి సినిమా త్రివిక్రమ్‌తో చేయనున్నారు. అయితే మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యేందుకు ఇంకా సమయం పట్టనుంది. దీంతో మహేష్ వరుసగా ఫారిన్ టూర్లకు వెళ్తున్నారు. కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారి వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా మహేష్ బాబు ఈ మధ్యే అమెరికా టూర్ వేశారు. అది ముగించుకుని ఈ మధ్యే వచ్చారు. తరువాత మళ్లీ లండన్ వెళ్లారు. అయితే ఆయన లండన్ వెళ్లేందుకు ఒక కారణం ఉందని తెలుస్తోంది. తన కుమారుడు గౌతమ్ కృష్ణ ఫారిన్‌లో చదువుతున్నాడు. ఓ ప్రముఖ తెలుగు నిర్మాత తనయుడు కూడా అక్కడే అడ్మిషన్ పొందాడు. దీంతో అదే స్కూల్‌లో మహేష్ తనయుడు గౌతమ్ కూడా చేరనున్నాడు.

ఇక సదరు స్కూల్‌లో ప్రస్తుతం గౌతమ్ కోసం మహేష్ అడ్మిషన్‌ను ట్రై చేస్తున్నారు. అందుకనే లండన్‌కు వెళ్లారు. ఫ్యామిలీతో సహా వారు అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే గౌతమ్‌కు అడ్మిషన్ చేయించాక వారు క్యాంపస్‌ను చూడనున్నారు. ఇక వారు లండన్ నుంచి రాగానే కొద్ది రోజుల తరువాత గౌతమ్ ఒక్కడే అక్కడికి వెళ్లనున్నాడు. ఆగస్టులో అతను లండన్‌కు ప్రయాణం అవుతాడని సమాచారం. దీంతో అందుకు ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే గౌతమ్ ప్రస్తుతం స్కూల్‌లో చదువుకుంటున్నాడు.. కనుక అది పూర్తయిన వెంటనే హీరోగా పరిచయం అవుతాడని సమాచారం. ప్రస్తుతం గౌతమ్ వయస్సు 15 ఏళ్లు. అంటే ఇంకో 3 ఏళ్లలో అతను హీరోగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఏదైనా అప్‌డేట్ ఇస్తారేమో చూడాలి.