Hero Movie : రాజకీయాలు మాత్రమే కాదు.. సినిమా రంగంలోనూ వారసుల హవా నడుస్తుంటుంది. అయితే రాజకీయాల్లో ప్రజల మెప్పు పొందాలి. సినిమాల్లో అయితే ప్రేక్షకుల మెప్పు పొందాల్సి ఉంటుంది. అలా అయితేనే ఆ వారసులు ఏ రంగంలో అయినా రాణిస్తారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కూడా మరో వారసుడు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అయ్యాడు. హీరో అనే పేరిట ఓ మూవీతో సినిమాల్లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలోనే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైంది.

అయితే ఈ మూవీకి పెద్దగా స్పందన లభించలేదు. అసలు ఈ మూవీ వచ్చినట్లే చాలా మందికి తెలియలేదు. కానీ నటనలో మాత్రం గల్లా అశోక్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ మూవీని త్వరలోనే ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నారు.
హీరో మూవీని ఈ నెల 11వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నారు. ఇందులో అశోక్ గల్లా సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటించింది. శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఒక సామాన్య వ్యక్తి సినిమా రంగంలో హీరో అవ్వాలనుకుంటాడు. అందుకోసం అతను ఏం చేశాడు.. అనేదే సినిమా కథ. ఇక ఇందులో అశోక్ తండ్రి పాత్రలో సీనియర్ నటుడు నరేష్ నటించగా.. జగపతి బాబు మరో పాత్రను పోషించారు.
అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన జుంబారే సాంగ్‌ను ఈ మూవీలో రీమిక్స్ చేశారు. కాగా ఈ మూవీని అమరరాజ మీడియా అండ్ ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్‌లో పద్మావతి గల్లా, గల్లా జయదేవ్‌లు నిర్మించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం పలు ఇతర పాత్రల్లో నటించారు.