Teeth : మన ముఖానికి అందం తెచ్చేది మన చిరునవ్వు. చిరునవ్వు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ముత్యాలలాగా మెరిసిపోయే దంతాలే. అలాంటి దంతాలు పసుపు రంగులో, గార పట్టినట్లు ఉంటే నవ్వడానికి భయపడతాం. చూసేవారు మనల్ని ఎక్కడ గమనిస్తున్నారో అనే భయంతో నవ్వడం కూడా మానేస్తాం. అంతేకాకుండా దంతాలను తెల్లగా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ విసిగిపోతుంటాం. మన దంతాలను తిరిగి తెల్లగా మార్చుకోవాలి అంటే ఇంటి చిట్కాలు ఎంతో బాగా పనిచేస్తాయి.
మన దంతాలను తిరిగి తెల్లగా మార్చుకోవడానికి వెల్లుల్లి పాయలను తొక్కతీసి పేస్ట్ లా చేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ టమాటా రసం, అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. అంతేకాకుండా మీరు నిత్యం వాడే టూత్ పేస్ట్ ఒక టీస్పూన్ వేసి అన్ని మిశ్రమాలను బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు పట్టించి బాగా తోమాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే పసుపు రంగులో మారిన దంతాలు, గార పట్టిన దంతాలు తెల్లగా మారుతాయి. ఈ చిట్కా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది.

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే రసాయనం, యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల దంతాలపై ఉండే మరకలను, పసుపు రంగును, గారను తొలగిస్తాయి. బేకింగ్ సోడాలో ఉండే లక్షణాలు దంతాలను శుభ్రంచేసి దంతాలు ముత్యాల్లాగా మెరిసిపోయేలా చేస్తాయి. రంగు మారిన, గార పట్టిన దంతాల సమస్యను నివారించుకోవడానికి డెంటిస్ట్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే, మనకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే రంగు మారిన, గార పట్టిన దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. మీ దంతాలను మీరే మెరిసిపోయేలా అద్భుతంగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను పాటించడం వల్ల దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా కూడా ఉంటాయి.