Throat Pain : సీజన్ మారిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో సతమతమవుతుంటాం. అలాగే గొంతులో గర గర, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలతో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యలకు ప్రారంభంలోనే గుడ్ బై చెప్పాలి అంటే ఈ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.
ఈ సీజన్ లో వచ్చే ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే చాలు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఈ సమస్యల నుండి బయట పడవచ్చు. గొంతు సమస్యల నుంచి బయటపడడానికి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కొంచెం వేడి చేసి అరచెక్క నిమ్మరసం, పావు టీస్పూన్ మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాస్ లో పోసి నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు అరస్పూన్ తేనె కలిపి తాగాలి.

ఈ నీటిని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగితే చాలా త్వరగా గొంతు సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ నీటిని తాగుతూ మరొక చిట్కాను కూడా పాటిస్తే ఇంకా త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర చెంచా రాళ్ళ ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ ఉప్పు నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇప్పుడు చెప్పిన ఈ రెండు చిట్కాలను పాటిస్తే చాలా త్వరగా గొంతు సమస్యలు తగ్గుతాయి. నిమ్మకాయ, మిరియాలు, తేనెలో ఉండే లక్షణాలు తొందరగా ఉపశమనం కలిగిస్తాయి. గొంతు నొప్పి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి సరైన సలహా తీసుకోవడం ఉత్తమం.