Faria Abdullah : జాతి రత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్ధుల్లా. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయం, ఆరడుగుల హైట్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటుంది. నవీన్ పొలిశెట్టి హీరోగా.. డైరెక్టర్ కేవీ అనుదీప్ తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమా ఫరియాకి తొలి చిత్రం కాగా, డెబ్యూ మూవీతోనే మంచి హిట్ కొట్టింది. చిత్రంలో ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్, రొమాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. జాతిరత్నాలుతో నవీన్ పొలిశెట్టికి ఎంత క్రేజ్ వచ్చిందో.. ఫరియాకు అంతే వచ్చింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది హీరోయిన్ ఫరియా. ఈ మధ్యకాలంలో డ్యాన్స్‌పై తనకున్న ఇష్టాన్ని బయటపెడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తుంది ఫరియా. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది.
వీడియోలో ఫరియా.. సంప్రదాయంగా పట్టు చీర కట్టుకుని.. రోడ్డుపై తీన్మార్ స్టెప్పులేసి కేక పుట్టించింది. డ్రమ్ పవర్ ఇదే.. ఆ సౌండ్‌కు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా అంటూ కామెంట్స్ పెట్టింది. ఫరియా షేర్ చేసిన వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
https://www.instagram.com/p/CUpgkhZKHr1/
ఫరియా.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న ఢీ సీక్వెల్లో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ హీరోయిన్లలో అత్యంత పొడగరిగా ఉన్న ఈ భామ పలు ఆఫర్స్‌ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆమెకు వచ్చిన ఆఫర్లలో హీరోల హైట్ ఆమెకంటే చాలా తక్కువట. అందుకే ఆ సినిమాలను ఫరియా సున్నితంగా తిరస్కరించిందనే టాక్స్ వినిపిస్తున్నాయి.