Faria Abdullah : జాతి రత్నాలు సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన నటి ఫరియా అబ్దుల్లా. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం వెంటనే రాలేదని చెప్పాలి. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈమెకు ఎన్నో అవకాశాలు వస్తాయని భావించారు. అయితే వెంటనే ఈమె అవకాశాలను అందుకోలేక పోయినప్పటికీ ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయని చెప్పవచ్చు.
ఇప్పటికే మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఢీ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఢీ అంటే ఢీ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె మరొక క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ చిత్రంగా తెరకెక్కుతున్న బంగార్రాజు చిత్రంలో నాగార్జున, నాగ చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించడానికి చిత్రబృందం జాతి రత్నాలు చిట్టిని సంప్రదించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె ఈ క్రేజీ ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిజానికి ఫరియా మంచి డాన్సర్.
హిప్ హాప్, బీ బాయింగ్, బెల్లీ డాన్స్ లలో ఆమె ట్రైనింగ్ తీసుకుంది. అందుకోసమే మేకర్స్ ఈ సినిమాలో నటించడం కోసం ఈమెను సంప్రదించగా అందుకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.