Ram Charan : హీరోలు అంటే అభిమానించే వారు చాలా మందే ఉంటారు. తమ అభిమాన హీరోను కనీసం ఒక్కసారి అయినా సరే కలుసుకోవాలని పరితపిస్తుంటారు. అందులో భాగంగానే వారిని కలిసేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆ కల కేవలం కొందరు ఫ్యాన్స్‌కు మాత్రమే నెరవేరుతుంది. ఇక కొందరు ఫ్యాన్స్ అయితే తమ అభిమాన హీరోల కోసం ఎన్నో వెరైటీ పనులు కూడా చేస్తుంటారు. అలా వారు చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాగే ఓ వ్యక్తి కూడా తన అభిమాన హీరో రామ్ చరణ్‌ను ఆకట్టుకునేందుకు ఓ ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకు ఆయనను కలుసుకోగలిగాడు. ఇక ఈ విషయం గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని గద్వాల్ జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి షార్ట్ ఫిలిం డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ మీద ఉన్న అభిమానంతో గతంలో ఇతను ఒక ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకుని దాంట్లో రామ్ చరణ్ తేజ ముఖ చిత్రం వచ్చేలా వరి పంటను పండించాడు. దీంతో అప్పట్లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే అలా పండించిన వరి ధాన్యాన్ని తీసుకుని అతను సుమారుగా 264 కిలోమీటర్లు నడిచి వచ్చి రామ్ చరణ్‌ను కలిశాడు. ఎట్టకేలకు తన కల నెరవేరిందని అతను సంతోషం వ్యక్తం చేశాడు.
ఇక అప్పట్లో తాను పండించిన రామ్ చరణ్ ముఖ చిత్రం కలిగిన వరి పంట తాలూకు ఫొటోలు, వీడియోలను రామ్ చరణ్‌కు చూపించాడు. అనంతరం ఆ పంటకు చెందిన ధాన్యాన్ని చరణ్‌కు అందజేశాడు. దీంతో చరణ్ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. తనపై తన అభిమాని చూపిస్తున్న అభిమానానికి చరణ్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు తన ఫ్యాన్‌తో చరణ్ సరదాగా గడిపాడు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ తన ఫ్యాన్‌ను చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నాడని.. ఆయన ఫ్యాన్స్ అందరూ మురిసిపోతూ.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…