RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీ.. ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇటీవలే ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్ అయింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఉత్తరాదిలోనూ ఘన విజయం సాధించింది. దీంతో రాజమౌళి ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది. ఈ మూవీలో తారక్ భీమ్‌గా.. చరణ్ అల్లూరిగా నటించి అలరించారు. అయితే అన్ని మూవీల్లోనూ చిన్న చిన్న విషయాలను కూడా దర్శకులు జాగ్రత్తగా దగ్గరుండి చూసుకున్నట్లే రాజమౌళి కూడా పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన తీసిన సినిమాలను బాగా పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ ఇలాంటి ఓ చిన్న విషయమే ఉంది. దాన్ని రాజమౌళి ఎంతో జాగ్రత్తగా చూపించారు. దాని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో నదిలో ఓ బాలుడు పడవపై చిక్కుకుపోయినప్పుడు భీమ్, రామరాజు ఇద్దరూ తాడుతో ఊగుతూ ఆ బాలుడికి చెరో వైపుకు వస్తారు. అనంతరం రామరాజు అప్పటి భారత జెండాను పట్టుకుని వస్తాడు. దీంతో భీమ్, రామరాజు ఇద్దరూ ఆ బాలున్ని రక్షిస్తారు. అయితే ఆ జెండా గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. ఈ జెండా తొలి భారతీయ జెండా. 1906 ఆగస్టు 7న వాడుకలోకి వచ్చింది. అప్పట్లో కోల్‌కతాలోని పార్శీ బగన్ చౌక్‌లో దీన్ని మొదటిసారిగా ఆవిష్కరించారు. అయితే ఆ జెండాను కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే వాడారు. 1907లో జెండా మళ్లీ మారింది.
1906లో ఆవిష్కరించబడిన మొదటి భారతీయ జెండాపై వందే మాతరం అన్న అక్షరాలు ఉంటాయి. పైన ఆకుపచ్చ, మధ్యలో పసుపు, కింద ఎరుపు రంగులు ఉంటాయి. ఈ రంగులపై పలు చిహ్నాలు కూడా ఉంటాయి. ఇక ఈ జెండాను కేవలం సంవత్సరం పాటు మాత్రమే వాడారు. 1907లో ఇంకో జెండాను ఆవిష్కరించారు. అంటే.. మనకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో చూపించింది.. 1906లో ఆవిష్కరించబడిన జెండా. కనుక ఆర్‌ఆర్‌ఆర్ మూవీలోని కథ కూడా 1906లో జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా రాజమౌళి చాలా చిన్న విషయాలలో కూడా ఎంతో జాగ్రత్త వహిస్తారని చెప్పవచ్చు. అందుకనే ఆయన తీసిన సినిమాలు అన్నీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఫ్లాప్ కాకుండా అన్నీ హిట్ అయ్యాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…