Shruti Haasan : శృతి హాసన్ ఈ మధ్య కాలంలో పలు వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటోంది. తెలుగులోనూ ఈమె పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇక తాజాగా ఈమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లైవ్ చాట్ సెషన్ నిర్వహించింది. అందులో తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది. అయితే ఒక నెటిజన్ మాత్రం ఆమెను ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగాడు.
తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో వారికి మాతృభాషపై మమకారం ఎక్కువ. హిందీని ఏమాత్రం సహించరు. గతంలో తమ భాషను కించ పరిచిన వారిపై వారు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఇలాంటి సంఘటనలు ఆయా రాష్ట్రాల్లో తరచూ జరుగుతూనే ఉంటాయి. హిందీ అంటే వారికి అసలు పడదు. అయితే ఓ నెటిజన్ శృతి హాసన్‌ను దీనిపైనే ప్రశ్న అడిగాడు. మీరు హిందీ మూవీల్లో కూడా నటించారు కదా, మీకు హిందీ మాట్లాడడం వచ్చా.. అని అడిగాడు.
ఇక అందుకు శృతి హాసన్ బదులిస్తూ.. ఇది 2022, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషులందరూ ఒక్కటే. పక్షపాతం చూపించడం ఎందుకు, మన భూగ్రహం ఏమైనా ప్రత్యేకమా.. అందరం సినిమాలు తీస్తున్నాం, కష్టపడుతున్నాం, పక్షపాతం చూపించడం తగదు.. అని శృతి హాసన్ రిప్లై ఇచ్చింది.
శృతి హాసన్ గతంలో లక్, తెవార్, దిల్ తో బచా హై జీ, డి డే, వెల్‌కమ్ బ్యాక్, రాకీ హ్యాండ్‌సమ్, బెహెన్ హోగీ తేరీ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు అక్కడ అంతగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగు సినిమాలతో ఆమె దశ తిరిగిపోయింది. ఇక ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో ప్రభాస్ పక్కన సలార్ మూవీలో నటిస్తోంది. ఈ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…