Farmer : రైతు ఖాతాలో రూ.15 ల‌క్ష‌లు పొర‌పాటున జ‌మ‌.. మోదీ ఇచ్చార‌ని ఆ డ‌బ్బుతో ఇల్లు క‌ట్టుకున్న రైతు..

Farmer : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 2014 సాధార‌ణ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే దేశంలోని న‌ల్ల‌ధ‌నాన్ని వెలికి తీసి ప్ర‌తి పేద వ్య‌క్తికి ఖాతాలో రూ.15 ల‌క్ష‌లు వేస్తామ‌ని చెప్పారు. అయితే ఆయ‌న ఆ వాగ్దానాన్ని నెర‌వేర్చ‌లేదు. కానీ పేద‌ల‌కు జ‌న్ ధ‌న్ ఖాతాల‌ను మాత్రం ఓపెన్ చేయించారు. అలాంటి ఓ వ్య‌క్తికి చెందిన జ‌న్ ధ‌న్ ఖాతాలో గ‌త కొద్ది నెల‌ల క్రితం రూ.15 ల‌క్ష‌లు పొర‌పాటున జ‌మ అయ్యాయి. అయితే అందులోంచి రూ.9 ల‌క్ష‌ల‌ను ఆ వ్య‌క్తి ఖ‌ర్చు పెట్టగా.. బ్యాంకు వారు ఇప్పుడు మేల్కొని ఆ డబ్బును వెన‌క్కి ఇచ్చేయాల‌ని కోరుతున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

Farmer

మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్ జిల్లా పైథ‌క్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వ‌ర్ ఓటె అనే రైతుకు స్థానికంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బ‌రోడా బ్యాంకులో జ‌న్ ధ‌న్ ఖాతా ఉంది. అయితే కొన్ని నెల‌ల కింద‌ట బ్యాంకు వారు అక్క‌డి పింపల్‌వాడి అనే గ్రామానికి చెందిన పంచాయ‌తీ ఖాతాలో రూ.15 ల‌క్ష‌లు డిపాజిట్ చేయాల్సింది పోయి పొర‌పాటున జ్ఞానేశ్వ‌ర్ ఖాతాకు ఆ మొత్తాన్ని ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు.

అయితే ఆ డ‌బ్బు పొర‌పాటున‌ ట్రాన్స్ ఫ‌ర్ అయి నెల‌లు గ‌డుస్తున్నా బ్యాంకు వారు ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు. ఇక ఆ రైతు త‌న ఖాతాలో రాత్రికి రాత్రే రూ.15 ల‌క్ష‌లు ఉండ‌డం చూసి షాక‌య్యాడు. నెల‌లు గ‌డుస్తున్నా.. ఎవ‌రూ అత‌న్ని సంప్ర‌దించ‌లేదు. దీంతో అత‌ను ఆ డ‌బ్బును ప్ర‌ధాని మోదీయే న‌ల్ల‌ధ‌నం ప‌థ‌కం కింద వేయించార‌ని అనుకుని అందులోంచి రూ.9 ల‌క్ష‌ల‌ను విత్‌డ్రా చేసి ఇంటిని నిర్మించుకున్నాడు. అలాగే త‌న‌కు రూ.15 ల‌క్ష‌ల‌ను ఇచ్చినందుకు మోదీకి థ్యాంక్స్ చెబుతూ ఓ లేఖ కూడా రాశాడు.

ఇక తాజాగా ఆ బ్యాంకు వారు ఆడిటింగ్ నిర్వ‌హించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. స‌ద‌రు మొత్తం ఆ గ్రామ పంచాయ‌తీ ఖాతాకు కాకుండా ఆ రైతు ఖాతాకు పొర‌పాటున బ‌దిలీ అయింద‌న్న విష‌యం తెలుసుకుని ఖంగు తిన్నారు. వెంట‌నే ఆ రైతు ఖాతాలో ఉన్న రూ.6 ల‌క్ష‌ల‌ను వెన‌క్కి తీసుకున్నారు. ఇక మిగిలిన రూ.9 ల‌క్ష‌ల కోసం ఆ రైతును వేడుకుంటున్నారు. ఎలాగైనా స‌రే ఆ మొత్తాన్ని వెన‌క్కి ఇచ్చేయాల‌ని.. లేక‌పోతే త‌మ ఉద్యోగాలు పోతాయ‌ని కోరుతున్నారు. ఇక ఆ రైతు మాత్రం త‌న‌కు ప్ర‌ధాని మోదీ న‌ల్ల‌ధ‌నం ప‌థ‌కం కింద ఆ డ‌బ్బు వేశార‌ని చెబుతున్నాడు. మ‌రి చివ‌ర‌కు ఏమ‌వుతుందో చూడాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM