Jabardasth Naresh : బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా ఎంతో మంది కమెడియన్లు మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం కెరియర్లో దూసుకుపోతున్నారు. ఈ కార్యక్రమంలో మొదట్లో ఆడవాళ్లు పాల్గొనే వారు కాదు.. మగవారే ఆడవాళ్ళ వేషధారణలో స్కిట్ లు చేసేవారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమంలో లేడీ కమెడియన్స్ కూడా సందడి చేస్తున్నారు. ఫైమా, వర్ష, రోహిణి వంటి వారు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్స్ పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్స్ హాజరై ఎంతో సందడి చేశారు.
క్యాష్ కార్యక్రమంలో పైమా, నరేష్ అల్లరి మామూలుగా లేదనే చెప్పాలి. క్యాష్ కార్యక్రమంలో భాగంగా ఫైమా.. నరేష్ కి ముద్దు పెట్టడం హైలెట్ గా మారింది. పొట్టి నరేష్ కు బూస్ట్ ఇస్తా అంటూ ఫైమా వెళ్లి తనకు బలవంతంగా కిస్ పెట్టడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.