F3 Movie : అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు ప్రధాన పాత్రల్లో వస్తున్న మూవీ.. ఎఫ్3.. గతంలో వచ్చిన ఎఫ్2 మూవీకి సీక్వెల్‌గా ఎఫ్3 మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఎఫ్2 మూవీ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఏకంగా రూ.130 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. దీంతో ఇప్పుడు ఎఫ్3 మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎఫ్2 కన్నా ఎఫ్3 మూవీ మరింత వినోదాన్ని పంచుతుందని.. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఈ క్రమంలోనే ఎఫ్3 మూవీకి చెందిన కథ అని ఓ స్టోరీ మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక దాని వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..
ఎఫ్2 లోలాగే ఎఫ్3 మూవీలోనూ భర్తలను డబ్బు కోసం హింసించే భార్యల కథను చూపించనున్నారు. అయితే ఈ మూవీలో మొదటి పార్ట్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్ డబ్బు సంపాదించడం కోసం పడే కష్టాలను చూపించారట. వారు హోటల్ బిజినెస్‌తోపాటు పలు రకాల బిజినెస్‌లను పెట్టి నష్టపోతారట. దీంతోపాటు డబ్బు కోసం భార్యల పోరు కూడా ఎక్కువవుతుంది. అయితే సెకండాఫ్‌లో ఒక 20 నిమిషాల పాటు ఔట్ అండ్ ఔట్ కామెడీ ఉంటుందట. ఓ సమయంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ గుప్త నిధి తవ్వేందుకు వెళతారట. కానీ వెంకటేష్‌కు రేచీకటి కారణంగా కనబడదు. వరుణ్ తేజ్‌కు నత్తి ఉంటుంది. ఇక ఈ ఇద్దరూ రాత్రి నిధులను తవ్వేందుకు వెళతారట. అయితే అదే సమయంలో ఇంకో బ్యాచ్ కూడా అక్కడికి నిధులను తవ్వేందుకు వస్తారట. దీంతో వెంకీ, వరుణ్ లను చూసి వారు దెయ్యాలని అనుకుంటారట. ఇలా సెకండాఫ్‌లో ఒక 20 నిమిషాల పాటు అద్భుతమైన కామెడీ ఉంటుందట. అలా అని చెప్పి ఓ స్టోరీ మాత్రం లీకైంది. ప్రస్తుతానికి ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టోరీయే. అయితే సినిమాలో కథ కూడా ఇలాగే ఉంటుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ఇక ఈ మూవీలో సునీల్, రాజేంద్ర ప్రసాద్, సోనాల్ చౌహాన్‌లు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రి రిలీజ్ వేడుక సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి మనిషి జీవితంలో నవ్వు ముఖ్యమని.. తాను 40 ఏళ్ల నుంచి నేర్చుకున్నది అదే అని అన్నారు. అయితే ఎఫ్3 మూవీ బోలెడన్ని నవ్వులను పంచుతుందని.. సినిమా హిట్ అవుతుందని.. అలా కాకుంటే తాను ఇకపై సినిమాల్లో కనిపించనని.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ మూవీ మే 27న విడుదల కానుంది. ఇందులో పూజా హెగ్డె ప్రత్యేక సాంగ్‌లో అలరించనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…