Extra Jabardasth : వెండితెరపై సందడి చేసిన ముద్దుగుమ్మలు ఇప్పుడు బుల్లితెరపై జడ్జిలుగా దర్శనమిస్తూ తెగ రచ్చ చేస్తున్నారు. రోజా, ఇంద్రజ, పూర్ణ, ఆమని ఇలా చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. పూర్ణ విషయానికి వస్తే ఈవిడ స్టైలే సపరేట్ అంటుంది. ఎవరైనా డాన్స్ బాగా చేస్తే చప్పట్లు కొడతాం.. లేదంటే లేచి నిలబడి అభినందిస్తాం.. అంతగా మరీ బాగా చేశారనిపిస్తే విజిల్స్ వేస్తాం.. లేదంటే వాళ్లతో కలిసి డాన్స్‌లు చేస్తాం.. ఓ హగ్ ఇచ్చి సరిపెట్టడం.. లాంటివి ఇంతకు ముందు చూసి ఉంటాము.. కానీ ఢీ జడ్జి పూర్ణ అంతకు మించి అన్నట్టుగా వ్యవహరించి సర్ ప్రైజ్ చేసింది.

ఆ మధ్య ఢీ13 షో కి గెస్ట్‌గా వచ్చిన అల్లు అర్జున్ కూడా.. పూర్ణ బుగ్గను కొరకడం చూసి షాకయ్యాడు. బన్నీ మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు.. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ డాన్స్ చేసుంటే ఏమైపోయేదో అని అన్నాడు. దానికి పూర్ణ పగలబడి నవ్వింది. తాజాగా నటి పూర్ణ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా ప్రత్యక్షమయింది. ఇక రోజా మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో జబర్దస్త్ టీమ్ తనకు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.
షోలో రోజాతోపాటు మరో జడ్జి స్థానంలో పూర్ణ సందడి చేసింది. పైమా పర్‌ఫార్మెన్స్‌కి పూర్ణ ముద్దు పెట్టడంతో ఇమ్మాన్యూయేల్ కూడా తనకు ముద్దు కావాలని పూర్ణని అడుగుతాడు. దీంతో పూర్ణ ఇప్పుడేంటి మీకు ముద్దు కావాలి కదా అయితే రండి అంటూ పిలవడంతో ఇమ్మాన్యుయేల్ నిజంగానే తనకు బుగ్గపై ముద్దు పెడుతుందని ఆశగా వెళ్లాడు. కానీ చేతిపై తన పెదాలు అంటీ అంటనట్టు ముద్దిచ్చింది. ఇది చూసిన సుధీర్ కూడా అడిగారు. దానికి పూర్ణ.. మీరు నా బుగ్గ కొరుకుతారా ? అని అడిగింది. సరే రండి అంటూ పూర్ణ సుధీర్ ను పిలవగా సుధీర్ ఆశగా వెళ్తాడు. ఆ సమయంలో రష్మి కల్పించుకొని పూర్ణ గారు కొరికితే మాత్రం నేను ఫీల్ అవుతా అంటూ రష్మీ ఎమోషనల్ అయింది. మరి సుధీర్ నిజంగానే కొరికాడా, అప్పుడు పూర్ణ, రష్మీల రియాక్షన్స్ ఎలా ఉంటాయి.. అనేది తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.