Evaru Meelo Koteeshwarulu : మరి కొద్ది రోజులలో బుల్లితెర ఫ్యాన్స్‌కి మాంచి కిక్ దొరకబోతోంది. ముగ్గురు స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించనుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాటర్‌లోకి వెళితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా కొనసాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో జనరంజకంగా మారి బుల్లితెర ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచుతున్నది. ఈ షో మరి కొద్ది రోజులలో ముగియనున్నట్టు తెలుస్తుండగా, చివరి గెస్ట్‌గా మహేష్ బాబు హాజరు కానున్నారు.
హాట్ సీట్‌లో ఉన్న మహేష్ బాబుని ఎన్టీఆర్ ఏదో ప్రశ్న అడగగా, దానికి మహేశ్ ఫోన్ ఎ ఫ్రెండ్‌గా పవన్ కళ్యాణ్‌కు కాల్ చేసి తన సపోర్ట్ తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో ముగ్గురు హీరోలు కలిసి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నారట. అయితే ఇందులో ఎన్టీఆర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తనకి బాగా ఇష్టం అయిన సినిమా “తొలిప్రేమ” అని చెప్పడం, దానికి పవన్ స్టన్నింగ్ రియాక్షన్ ఇస్తారని టాక్ నడుస్తోంది.
బిగ్‌బాస్ తొలి సీజన్ తర్వాత ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రెండో బుల్లితెర ప్రోగామ్ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో మహేష్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగనుందని సమాచారం. ఆట నాది.. కోటి మీది.. అంటూ మరోసారి ఎన్టీఆర్ తనదైన శైలిలో షోకు గ్లామర్‌ను తెచ్చారు.
రీసెంట్‌గా రాజా రవీంద్ర అనే పోలీస్ ఆఫీసర్ ఈ కార్యక్రమంలో పాల్గొని కోటి రూపాయలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ డిసెంబర్ 2వ తేదీన ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…